విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

Quality food should be provided to the students– ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి
– బాన్సువాడ ఆర్డిఓ రమేష్ రాథోడ్ 
నవతెలంగాణ – బాన్సువాడ / నసూరుల్లాబాద్ 
ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన భోజనం పౌష్టికాహారం అందించాలని ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని బాన్సువాడ ఆర్డిఓ రమేష్ రాథోడ్ తెలిపారు. మంగళవారం బాన్సువాడ మండలం బుడ్మి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని ఆర్డీవో రమేష్ రాథోడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు అందిస్తున్న భోజనం పట్ల నిర్లక్ష్యం చేయరాదని నిర్వాహకులకు సూచించారు. పాఠశాలలని సందర్శించారు ఉపాధ్యాయుల వివరాలను సేకరించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని మధ్యాహ్న భోజనాన్ని ఉపాధ్యాయులు పరిశీలించి విద్యార్థులకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బషీరుద్దీన్, ఎంపీఓ సత్యనారాయణరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు ఖలీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.