మండల కేంద్రంలోని కేజీబీవి, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల, మండల పరిషత్ పాఠశాలలను శనివారం ఎంపిడిఓ సోలమన్ రాజ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పలు రికార్డులను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అధికారులకు సూచించారు. అనంతరం పాఠశాలలో నిర్వహించిన శ్రమదానం కార్యక్రమాంలో పాల్గొని పిచ్చి మొక్కలను తొలగించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లపై ఏర్పడిన గుంతలను సిబ్బందితో పూడ్చేయించారు.