నవతెలంగాణ -పెద్దవూర
మత్స్య కార్మిక కుటుంబాల ఉపాధిని మెరుగుపర్చి, వారిని ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు నాణ్యమైన చేప పిల్లల పెంపకంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించిందని మాజీ జెడ్పి వైస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దవూర మండల కేంద్రం లో చెరువులో చేపపిల్లలను విడుదల చేసి మాట్లాడారు. మత్స్య అభివృద్ధి పథకం కింద 2024 – 2025 సంవత్సరానికి గాను వందశాతం సబ్సిడీపై చెరువులు, రిజర్వాయర్లలో చేప పిల్లలను పవిడుదల చేశామని అన్నారు.
మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యుల సమక్షంలో చేప పిల్లల రకాలను, సైజును, నాణ్యతను పరిశీలించి, బరువును తూకం వేస్తూ, ఒక్కొక్కటిగా వాటి సంఖ్యను క్షుణ్ణంగా లెక్కించిన మీదట చెరువులో వదిలామని తెలిపారు.ఈ చెరువులో మొత్తం 54,000 చేప పిల్లలు విడుదల చేయగా, అందులో బొచ్చ రకం 25000,రవ్వు రకం 25000,పల్సా జాతికి చెందిన 4000 చేప పిల్లలను చెరువులో వదిలామని వివరించారు. అనంతరం ముదిరాజ్ ల సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో హాలియ మార్కెట్ ఛైర్మెన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, తహసీల్దార్ సరోజ పావని,నియోజకవర్గం యూత్ అధ్యక్షులు పగడాల నాగరాజు, మండల యూత్ అధ్యక్షులు కిలారీ మురళి కృష్ణ, మాజీసర్పంచ్ సుంకి రెడ్డి ప్రభావతి సంజీవరెడ్డి, మార్కెట్ డైరెక్టర్ వూరే వెంకన్న,ముదిరాజ్ ల సంఘం అధ్యక్షులు అటికం యాదగిరి, ఉపాధ్యక్షులు ఈద సైదులు, కార్యదర్శి ఈద వెంకట్, డైరెక్టర్లు జోగు శంకరమ్మ, ఈద అంజయ్య, అటికం శేఖర్, గుండెబోయిన బాలాజీ, జోగు రామచంద్రం, కోట అంజి తదితరులు వున్నారు.