నాణ్యమైన తేనె కు మార్కెట్ లో ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది.

తేనెటీగల పెంపకం ఒక వ్యవసాయ ఆధారిత పరిశ్రమ. యువతీ, యువకులు తేనె ఉత్పత్తి కి ముందుకు రావాలి. జాతీయ స్థాయి లో జాతీయ బీ బోర్డ్ రైతులను ప్రొత్సహిస్తుంది.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సైతం రైతులను ప్రోత్సాహించటానికి రాయితీలు ఇస్తున్నాయి.తెలంగాణ ఉద్యాన శాఖ సైతం ఒక్కో రైతు 50 పెట్టెలు వరకు 40% రాయితీ ఇస్తుంది. ప్రస్తుతం బ్యాంకు లు సైతం ఈ రంగం లో లోన్ లు కల్పిస్తున్నాయి.. రైతు సహకార, రైతు ఉత్పత్తి సంఘాలు గా ఏర్పడి ఒక కుటీర గా ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తు ఉంటుంది.
– గుడిమళ్ల సందీప్ కుమార్, ప్రాజెక్టు ఉద్యాన అధికారి (పీఎచ్ఓ),సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ),ఉట్నూర్, ఆదిలాబాద్ జిల్లా.
తేనెటీగల సాగు చేపట్టే యువతీ యువకులకు ప్రభుత్వాలే కాదు తోటి రైతులు కూడా సహకారం అందించాలి..  ఈ బాక్స్ లు రైతుల పంట పొలాల్లో ఉంచటానికి చాలా మంది సంకోచిస్తున్నారు. దిగుబడులు తగ్గుతాయేమో అనే భ్రమ లో ఇంకొందరు ఉన్నారు.. వాస్తవానికి ఈ బాక్స్  లు పంట పొలాల్లో ఉంచటం వలన, వాటి యజమానులు కంటే ఆ రైతులకే ఎక్కువ లాభం ఉంటుంది. వీటి వలన పరపరాగ సంపర్కం జరిగి పంటల దిగుబడులు లో గణనీయంగా పెరుగుదల ఉంటుంది. ఈ విషయం క్షేత్ర స్థాయిలో అనేక సార్లు పరిశీలించాం. ఇది నిజమే అని నిరూపించ బడింది. కాబట్టి నిస్సంకోచంగా తేనెటీగలు పెంచే బాక్స్ లను తమ పంట పొలాల్లో ఉంచటానికి అనుమతి ఇవ్వండి.
ఈ తేనెటీగలు పెంచే చాలా మంది ఆ బాక్స్ లను తీస్కొని వాటికి ఇష్టమైన ఆహారం (పంటల పుప్పొడి) ఎక్కడ ఉంటే అక్కడికి తరలిస్తున్నారు. కొన్ని సార్లు దక్షిణ భారత దేశం నుండి ఉత్తరానికి సైతం వెళ్తున్నారు.అందుకే తేనెటీగల పెంచే వారు తమ చుట్టు ప్రక్కల రైతులకు అవగాహన కల్పించి, చుట్టు ప్రక్కల వాటికి అవసరమైన పంటలు సాగు చేయటం వలన చాలా ఖర్చులు తగ్గించుకోవటం తో పాటు రైతులకు కూడా పంట దిగుబడుల రూపం లో లాభం ఉంటుంది.
తేనె ఒక పురాతన ఆహారం,ఇది గత 5000 సంవత్సరాల్లో మన సంస్కృతి మరియు సంప్రదాయంలో భాగం.ఇది ప్రపంచంలోని ప్రతి పురాతన సంస్కృతిలో భాగం. భారత దేశం నుండి ఈజిప్టు మరియు గ్రీకు సంస్కృతుల వరకు తేనె ఆరోగ్యకరమైన ఆహారంగా ఎక్కువగా ఉపయోగించబడుతుంది. దీనిని ఆయుర్వేదంలో మరియు సాంప్రదాయ చైనీస్ వైద్యంలో ఔషధంగా ఉపయోగిస్తారు.తేనెటీగల కస్టం యొక్క ఫలితమే తేనె. తేనెటీగలు పువ్వుల నుండి మకరందాన్ని సేకరించి వాటి తేనెగూడు లో విడుదల చేస్తాయి.అదనపు తేమను తొలగించడానికి వాటి రెక్కలను ఫ్యాన్ లా ఆడిస్తాయి.ఆ తరువాత తేనె బంగారు రంగులో ఏర్పడుతుంది.తేనె ఉత్పత్తి పూర్తయిన తర్వాత,తేనెటీగలు తేనెగూడు కణాలను మైనపు తో కప్పి,వాటిని మూసి వేస్తాయి. దీని తరువాత,తేనె సేకరించే వారు వాటిని తీసివేసి తేనెను సేకరిస్తారు.ఒక  పౌండ్ తేనెను ఉత్పత్తి చేయడానికి, తేనెటీగలు రెండు మిలియన్ల పువ్వుల నుండి తేనెను సేకరించడానికి, 55,000 మైళ్ళ కు పైగా ప్రయాణించాల్సిన అవసరం ఉందని తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం.ఒక సాధారణ తేనెటీగల కాలనీలో 30,000 నుండి 60,000 తేనెటీగలు ఉంటాయి మొత్తంగా ఒక తేనెటీగ సంవత్సరంలో సుమారు 100 పౌండ్ల(45 కేజీలు) తేనెను ఉత్పత్తి చేస్తుంది.తేనెటీగల పెంపకం వ్యవసాయాధారిత పరిశ్రమ,రైతులు అదనపు ఆదాయం కోసం తేనేటీగల పెంపకాన్ని చేపట్టవచ్చు. తేనెటీగలు పూవుల లో మకరందాన్ని తేనె గా మార్చి, తేనెపట్టు అరలు లో నిల్వ చేసుకుంటాయి.అడవుల నుంచి తేనె సేకరించడం మనేది ఎప్పటి నుంచో వున్నదో తేనెకు దాని ఉత్పత్తులకు మార్కెట్లో గిరాకీ పెరుగుతుండడంతో, తేనెటీగల పెంపకం లాభసాటి పరిశ్రమగా మారింది తేనెటీగల పెంపకం నుంచి లభించే విలువైన ఉత్పత్తులలో తేనె,మైన ము ముఖ్యమైనవి.
తేనెటీగల పెంపకం:
తేనెటీగల పెంపకానికి కొద్దిపాటి పెట్టుబడి,వనరులు,సమయం చాలు
తేనెటీగల పెంపకానికి, మైనం తయారీకి వ్యవసాయ పరంగా ఎలాంటి విలువలేని స్థలమైనా చాలు మరి ఏ ఇతర వ్యవసాయ పరిశ్రమ కన్నా కూడా, తేనెటీగల పెంపకానికి అతి కొద్దిపాటి వనరులు సరిపోతాయి.
తేనెటీగల పెంపకం పర్యావరణం పై సానుకూల ప్రభావం చూపుతుంది. పూలు పూచే మొక్కలలో పరాగ సంపర్కానికి తేనెటీగలు ఎంతగానో తోడ్పడతాయి. ఆ విధంగా, ప్రొద్దు తిరుగుడు వంటి పంటలలో, వివిధ పండ్ల జాతులలో అధిక దిగుబడికి తేనెటీగల పెంపకం దోహదం చేస్తుంది. తేనె చాల రుచికరమైన, అధిక పోషక విలువలు కలిగిన ఆహార పదార్థం. తేనె పట్టుకోసం అడవులలో తేనెటీగల ను వేటాడటం పాత పద్ధతి, ఈ పద్ధతిలో ఎన్నెన్నో తేనెటీగల సమూహాలు నాశనమై పోయేవి. ఇళ్ళ వద్దనే పెట్టెలో తేనెటీగలు పెంచి, తేనే ను సేకరించడం వల్ల తేనెటీగల వినాశనాన్ని నివారించవచ్చు.
తేనెటీగల పెంపకాన్ని ఎవరికి వారు గా కాని, బృందాలుగా కాని చేపట్టవచ్చు.తేనెకు,మైనానికి మార్కెట్లో ఎంతో గిరాకీ ఉంది.
తేనెటీగల జాతులు:
ఇండియాలో నాలుగు జాతుల తేనెటీగలు ఉన్నాయి.అవి
రాక్ బీ (ఎపిస్ డార్పటా) ఇవి చాలా ఎక్కువ తేనె సేకరిస్తాయి. సగటున ఒక్కొక్క తేనె పట్టుకు 50 – 80 కిలోల తేనెను ఇవి సేకరిస్తాయి.
లిటిల్ బీ (ఎపిస్ ఫ్లోరియా) ఇవి బాగా తక్కువగా తేనెను సేకరిస్తాయి. ఒక్కొక్క పట్టుకు కేవలం 200 – 900 గ్రాముల తేనె మాత్రమే వస్తుంది.
ఇండియన్ బీ (ఎపిస్ సెరెనా ఇండికా) ఇవి ఏడాదికి సగటున 6-8 కిలోల తేనెను సేకరిస్తాయి.
• యూరోపియన్ బీ (ఇటాలియన్ బీస్) (ఎపిసమెల్లి ఫెరా) ఒక్కొక్క తేనె పట్టుకు సగటున 25-40 కిలోల తేనే వస్తుంది. కొండి లేని తేనెటీగ (ట్రిగోనా ఇరిడిపెన్నిస్) పైన పేర్కొన్న నాలుగు జాతులే కాకుండా కేరళలో కొండి లేని తేనెటీగ అనే మరో జాతి కూడా ఉంది. అయితే నిజానికి వాటికి కొండి బొత్తిగా లేకపోలేదు కాని అది అంతగా పెరగదు. ఇవి పరాగ సంపర్కానికి బాగా తోడ్పడతాయి. సంవత్సరానికి 300 400 గ్రాములు తేనెను సేకరించ గలవు.
తేనెటీగల పెంపకానికి కావలసిన పరికరాలు:
• తేనె పెట్టె (హైవ్) ఇది పొడవుగా వుండే ఒక చెక్క పెట్టె, దీని పై భాగం నుంచి కింది వరకు పొడవైన అనేక పెట్టెలు వుంటాయి. ఈ పెట్టె కొలతలు సుమారుగా ఇలా వుంటాయి. పొడవు 100 సెంటీమీటర్ల వెడల్పు 45 సెంటీమీటర్లు,
ఎత్తు 25 సెంటీమీటర్లు,మందం 2 సెంటీమీటర్లు,తేనెటీగలు రావడానికి,పోవడానికి వీలుగా ఈ పెట్టె కు ఒక్కొక్కటి ఒక సెంటీమీటర్ల వెడల్పు కలిగిన రంధ్రాలు వుంటాయి.పెట్టెకు పైన పెట్టెలు బిగింపు ఈ రంధ్రాలు మూసుకుపోయి విధంగా వుండాలి.పట్టెలు పెట్ట కింది వరకు వుండాలి. ఎక్కువగా తేనెటీగలు పెట్టితే,ఆ బరువును తట్టుకునే విధంగా పెట్టెలు 1.5 సెంటీమీటర్ల మందంతో వుండాలి. పెట్టెలో తేనెటీగలు తిరగడానికి ఇరుకుగా వుండకుండా,పెట్టె కు
పెట్టె కు మధ్య కనీసం 3.3 సెంటీమీటర్లు ఎడం వుండాలి.పొగ డబ్బా (స్మోకర్) ఇది ముఖ్యమైన రెండవ పరికరం. ఒక చిన్న డబ్బాను ఇందుకు ఉపయోగించవచ్చు. తేనెటీగలు మనలను కుట్టకుండా చూసుకోవడానికి, వాటిని అదుపు చేయడానికి డబ్బా ఉపయోగపడుతుంది.
గుడ్డ ముక్క – తేనే పట్టుకు దగ్గరగా పనిచేస్తున్నప్పుడు తేనెటీగలు కుట్టకుండా కళ్ళను ముక్కును కప్పుకోవడానికి
చాకు – తేనె పట్టె పై పట్టెలును కదిలించి, తేనే అరలను కత్తిరించడానికి
ఈక – తేనె అర నుంచి తేనెటీగలు ను నెట్టి వేయడానికి
రాణి ఈగ ను వేరు పరచు జిల్లెడ (క్వీన్ ఎక్క్సూడర్)
అగ్గి పెట్టె
తేనె పెట్టెలు ఏర్పాటు:
తేనె పెట్టెలును తప్పని సరిగా,నీరు నిల్వని ప్రదేశంలో ఏర్పాటు చెయ్యాలి.మకరందం, పుప్పొడి,నీరు బాగా
లభ్యమయ్యే పండ్ల తోటల సమీపంలో అయితే మరీ మంచిది.తేనె పెట్టెలో ఎప్పడూ అనువైన ఉష్ణోగ్రత వుండాలి. అందువల్ల, తేనె పెట్టె కు నేరుగా ఎండ తగలకుండా చూడాలి. చీమలు పట్టకుండా,తేనె పెట్టె స్టాండు కాళ్లకింద నీటి గిన్నెలు అమర్చాలి. వాన ఎండల నుంచి రక్షణకోసం
తేనెటీగల పట్టెలను తూర్పు దిశకు అమర్చాలి. తేనె పెట్టె వుండే దిక్కుకు కొద్ది తేడాతో అమరిక వుండాలి. తేనెటీగల అరలను పశువులకు,జంతువులకు అందుబాటులో వుండకుండా చూడాలి జన సమ్మర్దమైన రోడ్లపక్కన,వీధి దీపాల దగ్గర వీటిని వుంచకూడదు.
తేనెటీగల సముదాయాన్ని ఏర్పాటుచేయడం:
అడవిలో తేనెటీగల గుడ్లు వున్న తేనెపట్టెనుతెచ్చి, తేనెపెట్టెలో పెట్టడం ద్వారానో తేనెపట్టే సమీపం నుంచి వెళ్ళే తేనెటీగల గుంపును తేనె పెట్టెలోకి ఆకర్షించడం ద్వారానో తేనెటీగల సముదాయాన్ని ఏర్పాటు చేయవచ్చు.
తేనెటీగల గుడ్లునో, అటుగా వెళ్ళే తేనెటీగల గుంపునో ఆకర్షించడాని కంటే ముందుగా చేయవలసింది ఆ తేనెపెట్టెలో
తేనెటీగలకు అలవాటైన వాసన వుండేలా చూడడం. కొన్ని పాత తేనెతుట్టె ముక్కలనో, కొద్దిపాటి తేనె మైనాన్నో తీసుకుని ఈ కొత్త తేనె పెట్టెకు బాగా రుద్దాలి. వీలైతే, గుంపుగా వెళ్ళే తేనెటీగల నుంచి రాణి ఈగను పట్టుకుని, తేనె పెట్టెలో అడుగున వుంచాలి. అప్పుడు ఇతర తేనెటీగలు అక్కడికి ఆకర్షితమవుతాయి.
అరకప్పు వేడి నీటిలో, అరకప్పు చక్కెర కలిపిన ద్రావణాన్ని, తేనె పెట్టెలోకి చేరిన ఈ తేనెటీగల సముదాయానికి కొన్ని వారాలపాటు ఆహారంగా అందించాలి. తేనెటీగలు పట్టెల వెంబడి తేనే అరల నేర్పరచడాన్ని కూడా ఇది త్వరితం చేస్తుంది.
ఒక తేనె పెట్టెలో మరీ ఎక్కువ సంఖ్యలో తేనెటీగలు వుండకుండా జాగ్రత్త వహించాలి.
తేనె పెట్టె నిర్వహణ :
తేనె పట్టులో తేనె నిండే రోజులలో కనీసం వారానికొకసారి తేనె పెట్టెలను పరిశీలించాలి. ఉదయం పూట అయితే మరీ మంచిది.
ఈ వరసలో తేనె పెట్టెను శుభ్రం చేయాలి. పై భాగం, సూపర్/ సూపర్స్ ఛేంజర్, పిల్ల ఈగలు అరలు (బ్రూడ్ ఛేంజర్స్),
అడుగు పలక (ఫ్లోర్ బోర్డు) రాణి ఈగ బాగున్నదీ లేనిదీ, పిల్ల ఈగల పెరుగుదల ఎలా వున్నదీ, తేనె పుప్పొడి ఏ మేరకు పోగైందీ,
రాణి ఈగ వుండే అరలు ఎలా వున్నదీ, తేనెటీగలు ఏ సంఖ్యలో వున్నదీ ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.
తేనెటీగలకు హానికలిగించే ఈ క్రింది క్రిమికీటకాలు తేనె పెట్టెలో చేరాయేమో గమనిస్తుండాలి. మైనపు పురుగు (వాక్స్ మాత్) [ గల్లేరియా మెల్లోనెల్లా తేనె పెట్టె అరల నుంచి, పెట్టె మూలల నుంచి గ్రుడ్లను, కోశాలను తొలగించాలి. మైనపు పెంకు పురుగు (వాక్స్ బీటిల్స్) [ ప్లాటీ బోలియం] పురుగులనన్నీటిని ఏరిపారేయాలి. పెద్దవాటిని చంపేయాలి మైట్స్ పెట్టె ఫ్రేమ్ ను, కింది పలకను తాజాగా తయారు చేసిన పొటాషియం పెర్మాంగనేట్ ద్రావణంలో ముంచిన దూది లేదా నూలుగుడ్డ పీలికలతో బాగా తుడవాలి. కింది పలక మీద మైట్స్ అన్నీ పూర్తిగా పోయే వరకు ఇలా పదేపదే తుడవాలి.
తేనె సేకరణ తక్కువగా వుండే సీజన్లో నిర్వహణ సూపర్స్ ను తొలగించి, పిల్ల ఈగల అరలో ఆరోగ్యవంతమైన పిల్ల
ఈగలను దగ్గరదగ్గరగా వుంచాలి.అవసరమైతే అరను విడదీసే డివిజన్ బోర్డు ఉపయోగించాలి.రాణి ఈగ సెల్స్, పోతుటీగ సెల్స్ కనిపిస్తే వాటిని నాశనం చేయాలి ఒక్కొక్క తేనె పట్టుకు వారానికి 200 గ్రాముల చక్కెరను సమానపరిమాణపు నీటిలో కలిపి తయారు చేసిన ద్రావణాన్ని అందుబాటులో వుంచాలి.తేనె పెట్టెలోని అన్ని తేనె పట్టులకు ఆహారం అందుబాటులో వుంచాలి.
తేనె సేకరణ ఎక్కువగా వుండే కాలంలో నిర్వహణ తేనె సేకరణ ఎక్కువగా వుండే కాలానికి ముందే తేనె పట్టులో ఈగలు తగిన సంఖ్యలో వుండేలా చూడాలి, మొదటి సూపర్ కు, బ్రూడ్ ఛేంబర్ కు మధ్య వీలున్నంత ఎక్కువ ఖాళీ జాగా వుండేలా చూడాలి. అయితే మొదటి సూపర్ పైన ఖాళీజాగా వుంచకూడదు.
రాణి ఈగను పిల్లల (బ్రూడ్) అర్ధకే పరిమితం చేసే విధంగా, బ్రూడ్- సూపర్ ఛాంబర్ల మధ్య రాణిని వేరుపరచు జల్లెడ (క్వీన్ ఎక్కూడర్) ను వుంచాలి.తేనె పట్టును వారానికొకసారి గమనిస్తూ, తేనె నిండుగా వున్న చట్రాలను సూపర్ పక్కగా జరపాలి. మూడువంతులు తేనె లేదా పుప్పొడితో ఒక వంతు అంటుకుపోయిన పిల్ల ఈగలతో వున్న చట్రాలను బ్రూడ్ ఛెంబర్ నుంచి తీసివేయాలి. వాటి స్థానంలో ఖాళీ పట్టెలను లేదా చట్రాలను వుంచాలి.
పూర్తిగా లేదా మూడింట రెండు వంతులు తేనేతో నిండిన చట్రాలను బయటకు తీసి, తేనె పిండుకున్న తర్వాత తిరిగి సూపర్స్ లో పెట్టాలి.
తేనె తీయడం:
పొగ పెట్టి ఈగలను పక్కకు మళ్ళించి, తేనె పట్టిన భాగాలను జాగ్రత్తగా కత్తిరించి, తేనెను తీయాలి.
సాధారణంగా పూలు బాగాపూచే అక్టోబరు/ నవంబరు ఫిబ్రవరి / జూస్ సీజన్లలోను, ఆ తర్వాత కొద్దిరోజుల పాటు తేనె తీయడానికి అనువైన కాలం
బాగా తేనె నిండిన తేనె పట్టె లేత రంగులో వుంటుంది. రెండు వైపుల నగానికి పైగా తేనె గూళ్ళు మైనంతో నిండి వుంటాయి.
గ్రీక్ బాస్కెట్ హైవ్ (బుట్టలో తేనెపట్టు పెంపకం) గ్రీక్ బాస్కెట్ హైవ్ అనేది సాంప్రదాయికమైన పరిజ్ఞానం. కేవలం, స్థానికంగా లభ్యమయ్యే వస్తువులు, స్థానిక నైపుణ్యాలతో ఈ బుట్టతో తేనెటీగల పెంపకం సాగించ గలుగుతుండడంతో, ఇది ఇప్పటికీ అనువైన విధానమేతేనె పెట్టె నిర్మాణం.
వాడు విధానం:
ఈ బుట్ట పైభాగంలో ఎక్కువ వెడల్పుగా కింద తక్కువ వెడల్పుగా వుంటుంది. పైభాగాన్ని ఒక్కొక్కటి 1.25 అంగుళాల వెడల్పు వుండె, సమాంతరంమైన కొయ్య పలకలతో కప్పుతారు. తేనెటీగలు బయటకు వెళ్ళలేని మూత మాదిరిగా, వీటిని దగ్గర దగ్గరగా అమర్చుతారు. ఈ కొయ్య పలకలు ఒక అంగుళం మేర లోపలివైపునకు వంపు తిరిగి వుంటాయి. ఈ వంపు పలక మధ్యన కేంద్రీకృతమవుతుంది. పలకల రెండు చివరలూ 2-3 అంగుళాల వరకు సమతలంగా వుండాలి. ఎందుకంటే, బుట్ట అంచుకంటే మందమైన ఈ పలకలు చివరలలో వంపుగావుంటే, ఆ సందులనుంచి తేనెటీగలు తప్పించుకునే అవకాశం వుంటుంది. దానిని నివారించడం కోసమే, ఇలా బుట్ట అంచుపై చక్కగా నిలవడానికి వీలుగా, పలకల చివరలను సమతలంగా వుంచుతారు.
ప్రతి పలక పొడవునా, మధ్యలో కిందుగా ఒక మంచి తేనెతుట్టెను కరిగించిన తేనె మైనంతో అతికించాలి. తేనెటీగలు ఆ కొయ్యపలక కిందుగా బుట్ట చివరివరకు మంచి తేనెపట్టును పెట్టడానికి ఇది వాటికి దారి చూపుతుందన్నమాట. ఈ బుట్టకు లోపలివైపు, వెలువలివైపు రెండుభాగాలు ఆవు పేడ, ఒకభాగం బంకమన్ను కలిపిన మిశ్రమాన్ని పూయాలి.
ఈ మిశ్రమం పూత ఆరిన తర్వాత పలకలను బుట్ట పైన అమర్చి గడ్డితో చేసిన కిరీటాకారపు టోపీతో కప్పాలి. ఎండ, వానలనుంచి తేనెటీగల బుట్టను ఇది కాపాడుతుంది. బుట్టలోకి తేనెటీగలు వెళ్ళడానికి ఏర్పాటుచేసే ప్రవేశద్వారం బుట్ట అడుగునుంచి కనీసం మూడు అంగుళాలు ఎత్తులో వుండాలి. ఎందుకంటే, ఒకవేళ ఏదైనా తేనె తుట్టె కిందపడినా, ద్వారం మూసుకుపోకుండా వుండడానికి తేనె పట్టు తేనెతోనిండి, తేనె తీయడానికి సిద్ధంగా వుంటే, పలకలనుంచి తేనె పట్టులను జాగ్రత్తగా కోయాలి. అయితే, ప్రతి పలకకు పావు అంగుళాన్ని మించకుండా, మంచి తేనెపట్టు ముక్కను మిగిలించి, మిగతా దానిని కోయాలి. ఈ మిగిలిన చిన్న తేనెతుట్టె, తేనెటీగలను ఆకర్షించి, నేరుగా కొత్త తేనె పట్టు పెట్టే మార్గాన్ని సిద్ధంచేస్తుంది.
తేనెను ప్రతీరోజూ మన ఆహారంలో భాగంగా చేసుకుంటే కలిగే లాభాలు:
1. తేనె రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థ వివిధ వ్యాధుల నుండి మనలను రక్షిస్తుంది. నిమ్మకాయలలో విటమిన్ సి అధికంగా ఉన్నందు వల్ల, తేనెను నిమ్మకాయతో కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి మరింత పెరుగుతుంది. మీరు ఉదయం తేనెను, నిమ్మకాయ కలుపుకుని గోరువెచ్చని నీటిని తీసుకోవచ్చు.
2. తేనె జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రతను పెంచుతుంది.
3. దగ్గు మరియు గొంతు నొప్పికి సహజ నివారణగా WHO తేనెను సిఫార్సు చేస్తుంది.
4. తేనె యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది, అందువల్ల తేనె గాయాలను నయం చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది.
5. నిద్ర లేమితో బాధపడే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. మీరు నిద్రపోయే ముందు లేదా 2 టీస్పూన్ల తేనెతో ఒక గ్లాసు పాలు తాగవచ్చు. లేదా మీ నిద్ర యొక్క నాణ్యతను మెరుగుపరిచేందుకు నేరుగా ఒక టీస్పూన్ తేనెను తినవచ్చు.
6. తేనె నేచురల్ ఎనర్జీ డ్రింక్, శక్తిని త్వరగా పెంచుతుంది.
7. తేనె హైడ్రోజన్ పెరాక్సైడ్ను విడుదల చేస్తుంది, ఇది బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించే యాంటీ మైక్రోబియల్ ఏజెంట్గా పనిచేస్తుంది. తేనెను నీటితో కలిపి నేచురల్ మౌత్ వాష్ గా ఉపయోగించవచ్చు.
8. నొప్పిగా చిగుళ్ళపై తేనెను నేరుగా రుద్దడం వల్ల నొప్పి మరియు మంట నుండి ఉపశమనం లభిస్తుంది.
9. పంచదారకి బదులుగా తేనె ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం.
10. చర్మంపై తేనె రాయడం వల్ల చర్మం ఆరోగ్యం మెరుగుపడుతుంది. తేనెను నేరుగా చర్మంపై వేసి 20 నిముషాల పాటు వదిలేసి, తర్వాత కడిగి నీటితో మసాజ్ చేస్తూ కడగేయండి.
11. చర్మంపై మచ్చలు తగ్గిస్తుంది.
12. చర్మంపై ముడతలు తగ్గించి యవ్వనంగా ఉండేలా చేస్తుంది.
13. యాంటీ బాక్టీరియల్ లక్షణాల కారణంగా, మొటిమల నివారణకు తేనె చాలా బాగా పనిచేస్తుంది.
14. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
15. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
16. తేనె తీసుకోవడం వల్ల చక్కెర తినాలనిపించదు. అందువల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది మెటబాలిజంను వేగవంతం చేస్తుంది. మరియు కొవ్వును కరిగిస్తుంది.
17. తేనె చుండ్రును తగ్గిస్తుంది. నీటితో తేనె కలిపి తలకి రాయండి. మూడు గంటలు తర్వాత కడగండి. ఇలా వారానికి ఒకసారి చేయవచ్చు.
18. ఇది జుట్టును మృదువుగా మరియు మెరిసేలా చేయడానికి సహజ కండిషనర్గా పనిచేస్తుంది.
19. తేనె రాయడం వల్ల పెదాలు మృదువుగా అవుతాయి.
20. హిమోగ్లోబిన్ సంఖ్యను పెంచడంలో సహాయపడుతుంది మరియు రక్తహీనతతో బాధపడేవారికి ఉపయోగపడుతుంది.
21. చిన్నప్రేవుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అద్భుతమైన ప్రోబయోటిక్. పెరుగుతో తినడం వల్ల చిన్నప్రేవుల ఆరోగ్యం మరింత మెరుగు పడుతుంది. 22. జీర్ణక్రియను పెంచడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి బలమైన జీర్ణక్రియ చాలా ముఖ్యం
23. ఇది రక్తపోటును సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. తక్కువ రక్తపోటు మరియు అధిక బ్లూక్ ప్రెజర్ రెండింటిలోనూ సహాయపడుతుంది.
24. తేనెలో నియాసిన్, రిబోఫ్లేవిన్, పాంతోతేనిక్ ఆమ్లం, కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, భాస్వరం, పొటాషియం మరియు జింక్ వంటి చిన్న మొత్తాలలో చాలా ఖనిజాలు మరియు విటమిన్లు ఉన్నాయి.
25. తేనె ఒక వ్యక్తి యొక్క పునరుత్పత్తి శక్తిని మెరుగుపరుస్తుంది.
26. ఒక వ్యక్తిలో సాత్విక లక్షణాలను ప్రోత్సహించే సాత్విక ఆహారంగా ఆయుర్వేదంలో పరిగణించబడుతుంది.
27. ఇది శరీరం యొక్క నయమయ్యే శక్తిని పెంచుతుంది.