
అంగన్వాడీ కేంద్రాలలోనే నాణ్యమైన పౌష్టికాహరం అందిస్తున్నామని అనుముల ప్రాజెక్టు మహిళాశిశు సంక్షేమ చలకుర్తి సెక్టార్ సూపర్ వైజర్ గౌసియా బేగం అన్నారు. శనివారం మండలంలోని చింతపల్లి అంగన్వాడీ కేంద్రం లో టీచర్లుకు నిర్వహించిన సెక్టారు సమావేశంలో తెలిపారు. ఈ సందర్బంగా టీచర్లు రిజిస్టర్లు పరిశీలించి మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్నామని తెలిపారు. అలాగే పిల్లలకు, గర్భిణీ, బాలింతలకు, పాలు, మురుకులు, బాలామృతం, గుడ్లు, మధ్యాహ్నం భోజనం అందిస్తున్నామని అన్నారు. పౌష్టికాహారం సమయానికి అందించాలని కోరారు. చిరుధాన్యాల వల్ల అందే పోషక విలువలను తెలియజేయడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్క మహిళలు రాగులు, సజ్జలు, కొర్రలు, మొదలగు త్రుణ ధాన్యాలలో ఐరన్ పిండిపదార్థాలు అధికంగా లభిస్తాయని తెలిపారు. చిరుధాన్యాలను తప్పనిసరిగా మహిళలందరూ స్వీకరించి ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీచర్లు అంజమ్మ, నారాయణమ్మ, రమణ, పద్మ, శారద, లక్ష్మి, శాంతమ్మ, ఉమ, యాదమ్మ వరలక్ష్మి, ఉమ, వాణి,బుచ్చమ్మ, నీలా మంగమ్మ, శారద, లక్ష్మి, గర్భిణీలు,బాలింతలు, పాల్గొన్నారు.