
అంగన్వాడీ కేంద్రాలలోనే నాణ్యమైన పౌష్టికాహారం సాధ్యమని,సమాజ నిర్మాణం సాధ్యం అంగన్వాడీ కేంద్రాలలోనే ఆరోగ్య వంతమైనా సమాజ నిర్మాణం సాధ్యం అవుతుందని ఐసీడీఎస్ సూపర్ వైజర్ గౌసియా బేగం పేర్కొన్నారు. శనివారం నాయినవాని కుంట, నాయినవానికుంట తండా లోని అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం పోషణ అభియాన్, పోషణమాసం,కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామం లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సూపర్ వైజర్ మాట్లాడారు. గర్భిణీలు తీసుకోవాల్సిన పోషక నియమాలను వివరించారు. చిరుధాన్యాల వల్ల అందే పోషక విలువలను తెలియజేయడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్క మహిళలు రాగులు, సజ్జలు, కొర్రలు, మొదలగు త్రుణ ధాన్యాలలో ఐరన్ పిండిపదార్థాలు అధికంగా లభిస్తాయని తెలిపారు. చిరుధాన్యాలను తప్పనిసరిగా మహిళలందరూ స్వీకరించి ఆరోగ్యంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు మూల నారాయణమ్మ,నడ్డి అంజమ్మ, ఆయాలు రమావత్ శౌరి, రొంపే యాదమ్మ,ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు రేణుక, గ్రామస్తులు కత్తి జనార్ధన్ రెడ్డి,చిమట పాపయ్య,జానపాటి సైదయ్య,కొట్టె కోటయ్య, జానపాటి జానయ్య,కత్తి రామేశ్వరమ్మ, గర్భిణీలు, బాలింతలు గ్రామస్తులు పాల్గొన్నారు.