అంగన్వాడీ కేంద్రాలలోనే నాణ్యమైన పౌష్టికాహారం

నవతెలంగాణ – పెద్దవూర
అంగన్వాడీ కేంద్రాలలోనే నాణ్యమైన పౌష్టికాహరం అందిస్తున్నామని అనుముల ప్రాజెక్టు మహిళా శిశు సంక్షేమ అధికారి గంధం పద్మావతి చలకుర్తి సెక్టార్  అన్నారు. మంగళవారం మండలం లోని కుంకుడు చెట్టు తండా అంగన్వాడీ కేంద్రం లో టీచర్లుకు నిర్వహించిన సెక్టారు సమావేశంలో తెలిపారు. ఈసందర్బంగా టీచర్లు రిజిస్టర్లు పరిశీలించి మాట్లాడారు.అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్నామని తెలిపారు. అలాగే పిల్లలకు, గర్భిణీ, బాలింతలకు, పాలు, మురుకులు, బాలామృతం, గుడ్లు, మధ్యాహ్నం భోజనం అందిస్తున్నామని అన్నారు.అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఆట, పాటలతో ప్రాథమిక విద్య నేర్పాలని, పౌష్టికాహారం సమయానికి అందించాలని కోరారు. ఈ సమావేశంలో అంగన్వాడీ సూపర్ వైజర్ గౌసియా బేగం,టీచర్లు శాంతమ్మ, యాదమ్మ, నారాయణమ్మ, శారద, పద్మ, రమణ,ఉమ, తదితరులు పాల్గొన్నారు.