సేంద్రీయ సాగుతో నాణ్యమైన దిగుబడులు..

Quality yields with organic farming..– ఆయిల్ ఫాం ఔత్సాహిక రైతులకు ఒక్క రోజు శిక్షణ..
– వ్యవసాయ సాగులో జీవన ఎరువుల ప్రాముఖ్య పై అవగాహన..
నవతెలంగాణ – అశ్వారావుపేట
సేంద్రీయ సాగు తో పంట ఏదైనా నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని మెదక్ జిల్లా,తునికి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త శంభాజీ దత్తాత్రేయ మల్కర్ అన్నారు. వ్యవసాయ ఉద్యాన పంటల్లో జీవన ఎరువుల ప్రాముఖ్యత అనే అంశం పై మెదక్ జిల్లా,కౌడిపల్లి మండలం,తునికి  లో గల భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి,డాక్టర్ రామానాయుడు ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ లో మంగళవారం ఉద్యాన శాఖ,తెలంగాణ ప్రభుత్వం వారి సౌజన్యంతో, భారతీయ ఆయిల్పామ్ పరిశోధనా సంస్థ వారి సాంకేతిక సహకారంతో, మహా రాష్ట్ర కు చెందిన ఎం/ఎస్ లివ్ పామ్  రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్  (లివింగ్ ఫుడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి అనుబంధ సంస్ధ) ఆద్వర్యంలో  అశ్వారావుపేట ఆయిల్ పామ్ రైతుల ఎఫ్.పి.ఓ ఔత్సాహిక రైతులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఉద్యాన పంటల్లో జీవన ఎరువులు ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉన్నాయని,మన పూర్వీకులు ఈ ఎరువులు వాడి సాగు చేసేవారని గుర్తు చేసారు. మారుతున్న జీవన వైవిద్యం అనుగుణంగా రైతులు తమ వ్యవసాయ సాగు పద్ధతులను అవలంభించాలని పేర్కొన్నారు. మేనేజర్ కృష్ణ, కేవీ కే సైంటిస్ట్ లు శ్రీకాంత్,రవి,భారతి రాజా లు సాగు పద్దతులు,ఎరువుల యాజమాన్యం,జీవన ఎరువులు తయారీ అంశాలను బోధించారు. ఈ కార్యక్రమంలో తుంబూరు మహేశ్వర రెడ్డి,కొక్కెరపాటి పుల్లయ్య,తుమ్మ రాంబాబు,తగరం జగన్నాధం,సంతపురి చెన్నారావు తదితరులు పాల్గొన్నారు.