ప్రశ్నించే పవర్‌ఫుల్‌ పాత్ర

Questioning is a powerful roleవిరాట్‌ కర్ణ హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న న్యూ ఏజ్‌ పొలిటికల్‌ థ్రిల్లర్‌ ‘పెదకాపు-1’. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో కీలక పాత్ర పోషించిన సీనియర్‌ నటుడు తనికెళ్ళ భరణి మీడియాతో మాట్లాడుతూ, ‘ఇందులో నా పాత్ర సమాజంపై విసిగిపోయిన ఓ మేధావి పాత్ర. స్కూల్‌ టీచర్‌కి సమాజంపై ఒక అవగాహన ఉంటుంది. నా పాత్ర దర్శకుడి వాయిస్‌ని రిప్రజంట్‌ చేస్తుంది. ప్రేక్షకుల తరపున ప్రశ్నించే పాత్ర. చాలా అద్భుతమైన వేషం. ఈ మధ్య కాలంలో నేను చేసిన ది బెస్ట్‌ క్యారెక్టర్‌ ఇది. ఈ చిత్రంలో దర్శకుడు శ్రీకాంత్‌ అడ్దాల ట్రాన్స్‌ఫర్మేషన్‌ చాలా భిన్నంగా ఉంటుంది. విరాట్‌ కర్ణ కొత్త హీరోగా కాకుండా ఒక పాత్రగా కనిపించి, నన్ను సర్‌ప్రైజ్‌ చేశాడు. నా 40 ఏళ్ల కెరీర్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఒక సినిమా చేయాలనే కోరిక మాత్రం ఉంది’ అని తెలిపారు.