ప్రశ్నించే గొంతుక నవతెలంగాణ దినపత్రిక

– స్థానిక తాసిల్దార్ తోట రవీందర్ 
– నవతెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-తాడ్వాయి
నిరంతరం ప్రజా సమస్యలపై ప్రచురితమయ్యే వార్తలను ప్రచురించే దినపత్రిక నవతెలంగాణ దినపత్రిక అని స్థానిక తహసిల్దార్ తోట రవీందర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో వివిధ పార్టీల నాయకులతో కలిసి నవతెలంగాణ 2024 నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక తహసిల్దార్ తోట రవీందర్, పిఎసిఎస్ డైరెక్టర్లు యానాల సిద్ది రెడ్డి, కాయితి లింగ చారి లు మాట్లాడుతూ పత్రికలో ఉన్నది ఉన్నట్టుగా నికచ్ఛితంగా వార్తలు రాసే ఏకైక పత్రిక నవ తెలంగాణ దినపత్రిక అని అన్నారు. ప్రతి నిత్యం ప్రజా సమస్యలపై ప్రజల సమస్యలు వెలికితీసే దినపత్రిక అని కొనియాడారు. నిజాన్ని నిర్భయంగా రాయడంలో నవతెలంగాణ ముందుంటుందని అన్నారు. కార్మిక, కర్షక, శ్రామిక, రైతుల, పేదల, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి నవతెలంగాణ పత్రిక నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు. గత ఏడాది మంచి చెడులను మరచి కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ కొమరం రామారావు, యానాల సిద్దిరెడ్డి, కాయితి లింగచారి, ఎం ఆర్ ఐ డేగల సాంబయ్య, ఐకెపి సిసి పూనెం నర్సింలు, సహకార బ్యాంక్ క్లర్క్ తేనె కుంట్ల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.