నవతెలంగాణ – బెజ్జంకి
విద్యుత్ వినియోగదారుల సమస్యలకు సత్వర పరిష్కారం చేస్తున్నామని ఏడీఈ సుదీర్ బాబు సూచించారు.ఆదివారం మండల కేంద్రంలోని ఏడీఈ కార్యలయంలో విద్యుత్ వినియోగదారుల దినోత్సవం ఏడీఈ సుదీర్ బాబు నిర్వహించారు. అన్ని క్యాటగిరిల వారికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని..సరఫరాలో తలెత్తిన సమస్యల పరిష్కారానికి విద్యుత్ సిబ్బందితో కృషి చేస్తున్నామని ఏడీఈ సుదీర్ బాబు తెలిపారు. పలువురు రైతులు సమస్యలను ఏడీఈ దృష్టికి తీసుకువెళ్లారు. పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారించేల శాయశక్తుల కృషి చేస్తామని ఏడీఈ తెలిపారు. ఏఈ మహేశ్,బస్వాపూర్ ఏఈ రామాంజనేయులు,సబ్ ఇంజనీర్ పవన్,రైతులు పాల్గొన్నారు.