విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ పాటవాలను వెలికి తీసేందుకు శనివారం కాటాపూర్ జడ్.పి.హెచ్.ఎస్ ప్రధానోపాధ్యాయులు బాణాల సుధాకర్ ఆధ్వర్యంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు సక్రూ నాయక్ లు విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించారు. క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్విజ్ పోటీల ద్వారా విద్యార్థులకు సమయపాలనపై సరైన స్పష్టత వస్తుందన్నారు. క్విజ్ పోటీల ద్వారా తమ వ్యక్తిత్వాన్ని తాము మెరుగుపరచుకోవడానికి దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జీవన్ లాల్, సుతారి పాపారావు, కోడూరి సమ్మయ్య, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.