గణిత ఫోరం ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు

నవతెలంగాణ – జన్నారం
మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న పలు  ప్రభుత్వ పాఠశాల లో చదువుతున్న విద్యార్థుల కు తెలంగాణ గణిత ఫోరమ్ ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు నిర్వహించారు. గత 15 సంవత్సరాల పబ్లిక్ పరీక్షలో వచ్చిన ప్రశ్నలను బహుళ ఇచ్చిక ప్రశ్నల పై క్విజ్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.ఈ పోటీలలో ప్రథమ బహుమతి కిష్టాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆకుల అన్వేష్, వేల్పుల నరేందర్, కొత్త అనిల్, ద్వితీయ బహుమతి పాఠశాల బాదంపెళ్లి పాఠశాలకు చెందిన జాడి శ్రీవాణి, బండ విజయలక్ష్మి, రాకేష్ తృతీయ బహుమతి చింతగూడ పాఠశాలకు చెందిన జె నిహారిక, నందిని, గంగ భవన నందిని విజేతలుగా నిలిచారు. సమావేశం అనంతరం గణిత ఉపాధ్యాయులు గా ఉండి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందిన కిష్టాపూర్ ప్రధానోపాధ్యాయులు రాజన్న, కామనపల్లి ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, కవ్వాల్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ ,మురిమడుగు ప్రధానోపాధ్యాయులు అజయ్, ఉన్నత పాఠశాల గర్ల్స్ జన్నారం ఉపాధ్యాయులు రామన్న, తపాలపూర్ ప్రధానోపాధ్యాయులు మురళీధర్ లను గణిత ఫోరం ఆధ్వర్యంలో సన్మానించారు.ఈ కార్యక్రమంలో గణిత ఫోరం సభ్యులు జాడి రాజన్న ఆర్ విద్యాసాగర్, గోవర్ధన్, దేవ్ సింగ్, కందుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు