కోరం లేక వాయిదా పడిన మండల సభ

నవతెలంగాణ – తాడ్వాయి 

గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పై ప్రతి మూడు నెలలకోసారి జరిగాల్సిన మండల సర్వ సబ్య సమావేశం గురువారం సభ్యుల కోరం లేక వాయిదా పడింది. సభ నిర్వహనకు అవసరమైన ఎంపీటీసీ సభ్యులు లేక పోవటంతో సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎంపీడీవో సుమన వాణి తెలిపారు. ప్రజా సమస్యల పై చర్చించాల్సిన ప్రజాప్రతినిధులు సభకు రాకుండా స్వంత పనులు చూసుకోవటం విడ్డూరంగా ఉంది. సభ్యుల సంగతి పక్కన పెడితేసభకు హాజరయ్యే అధికారులు కూడా అంతంత మాత్రంగానే హాజరయ్యారు. సర్పంచులు లేనందున అభివృద్ధి లో భాగంగా గ్రామాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఈ ప్రత్యేక అధికారులు కూడా  గైర్హాజరు కావడం, అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రజల సమస్యల పై చర్చించాల్సిన మండల సర్వసభ్య సమావేశం పట్ల బాధ్యత గల ప్రజాప్రతినిధులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. సర్వసభ్య సమావేశాన్ని వదిలేసి ప్రజాప్రతినిధులందరూ ఎవరికి తోచిన విధంగా వారు వెళ్లడం పట్ల సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికయినా జిల్లా స్థాయి ఉన్నతాధి కారులు జోక్యం చేసుకొని మండల సర్వసభ్య సమావేశం సరైన సమయంలో జరిగే విధంగా చర్యలు చేపట్టాలని మండల ప్రజలు డిమాండ్ చేశారు.