పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్ జెడి..

నవతెలంగాణ – నవీపేట్: మండలంలోని నాగేపూర్ ఉన్నత, ప్రైమరీ పాఠశాలలతో పాటు మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలను రీజనల్ జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లోని రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వచ్చే పదవ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని అదేవిధంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి అశోక్ మరియు ఎంఆర్ సి సిబ్బంది రాకేష్ లు ఉన్నారు.