నవతెలంగాణ – మల్హర్ రావు
బలహీన వర్గాల బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్యకి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని జాతీయ బిసి సంఘం భూపాలపల్లి జిల్లా ఇంచార్జి విజయగిరి సమ్మయ్య నాయి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం మండలంలోని కొయ్యుర్ ప్రెస్ క్లబ్ లో మాట్లాడారు. తెలంగాణ బీసీ ముద్దుబిడ్డ జాతీయబీసీ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య 45 గత 50 సంవత్సరాల నుండి జీవితం మొత్తం బీసీల కొరకు నిరంతరం పోరాడుతున్నారని తెలిపారు. విద్యార్థులకు గురుకుల హాస్టల్ ఫీజు రీయిమెంట్ బీసీల హక్కుల సాధనకై ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఎన్నో ధర్నా కార్యక్రమం చేశారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా ఎన్నికై బీసీల తరపున వాణి అసెంబ్లీలో వినిపించారని పేర్కొన్నారు. పార్లమెంట్ రాజ్యసభలో బీసీల పక్షాన వాణి వినిపించారని, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని బీసీల జనాభా ప్రతిపాదనపరంగా రిజర్వేషన్ ప్రకటించాలని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయాలని, బీసీలకు అట్రాసిటీ చట్టం అమలు చేయాలని, బలహీన వర్గాల బీసీ లకు రాజ్యాధికారం రావాలని ఉద్యమం చేశారని వివరించారు. త్వరలో ఢిల్లీలో ధర్నా కార్యక్రమం చేపడుతున్నారన్నారు. కేంద్రం ప్రభుత్వం ఇప్పటికైన బిసి ఉద్యమ నేతను గుర్తించి వెంటనే పద్మశ్రీ అవార్డు ప్రకటించాలని డిమాండ్ చేశారు.