నవతెలంగాణ – ముత్తారం: ముత్తారం మండల ప్రత్యేకాధికారిగా డిఆర్డిఎ ఆర్.రవీందర్ అదనపు బాధ్యతలను గురువారం స్వీక రించారు. నూతనంగా మండల ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఆర్. రవీందర్ ను ఎంపిడిఓ లలిత, ఎంపిఓ బైరి వేణు మాధవ్ కలిసి మండంలోని గ్రామాల కార్యదర్శులు ఈ సందర్భంగా ఆ యనను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండ తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడూ పరిష్కరిస్తూ వారికి సేవలు అం దించాలని సూచించారు.