రేస్‌ ఈకో, గణేషా ఈకోస్పేర్‌ జట్టు

హైదరాబాద్‌ : ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌లోని రేస్‌ ఈకో చెయిన్‌ లిమిటెడ్‌, గణేషా ఈకోస్పేర్‌ లిమిటెడ్‌ ఒప్పందం కుదర్చుకున్నాయి. ఈ సంయుక్త భాగస్వామ్యంలో పిఇటి రీసైకిల్‌ కోసం గణేషా రీసైక్లింగ్‌ చెయిన్‌ ప్రయివేటు లిమిటెడ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపాయి. దీంతో దేశ వ్యాప్తంగా ప్లాస్టిక్‌ బాటిళ్లను తిరిగి రీసైక్లింగ్‌ ద్వారా ఉపయోగంలోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. కొత్త సంస్థలో రేస్‌ ఈకోకు 51 శాతం, గణేషా ఈకోస్పేర్‌కు 49 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి.