మంత్రి జూపల్లి పర్యటనలో రచ్చ రచ్చ..

Racha Racha during Minister Jupally's visit..నవతెలంగాణ – ఆర్మూర్ 

మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ వడ్ల కొనుగోలు కేంద్రం పరిశీలనకు వచ్చిన రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటనలో రచ్చ రచ్చ అయింది. ప్రోటోకాల్ ప్రకారం అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో జిల్లా పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఫోటోలు లేకపోవడం కాంగ్రెస్, బిజెపి కార్యకర్తలు  తోసుకున్నారు. దీంతో ఫ్లెక్సీ లను సైతం చింపి వేసినారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో పోలీసులు ఇరు పార్టీ కార్యకర్తలను సముదాయించడంతో ప్రశాంతత నెలకొంది. కాగా గత కొన్ని నెలల క్రితం మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ఇందిరమ్మ కాలనీ ఎందు ఎక్సైజ్ కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి జూపల్లి రాకమందు కార్యకర్తలు రసాభాస చేశారు.