– మాజీ జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్
– బాధిత కుటుంబాలను ఆర్థికసాయం అందజేత
నవతెలంగాణ-ఆమనగల్
పేదలకు అండగా జర్పుల రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు కొనసా గుతాయని ట్రస్ట్ చైర్మెన్, మాజీ జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్ అన్నారు. ఇటీవల కడ్తాల్ మండలంలో ఇటీవల అనారోగ్యంతో బాధపడుతు మతిచెందిన గుర్లకుంట తండాకు చెందిన రాజు నాయక్, వెలుగురాళ్ళ తాండాకు చెందిన దర్జీ, పెద్దవేములోని బావి తాండాకు హీంలా నాయక్, చరికొండకు చెందిన కొత్తపల్లి జంగమ్మ, చిందం గుండాలు, పల్లె చెల్క తాండాకు చెందిన మంగ్య కుటుంబ సభ్యు లను దశరథ్ నాయక్ మం గళ వారం స్థానిక నాయకు లతో కలిసి పరామర్శించి ఓదార్చారు. అదేవిధంగా తన ట్రస్ట్ ద్వారా వారికి రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భారతమ్మ నర్సింహ గౌడ్, శ్వేత భూనాథ్, నాయకులు జంగయ్య, రమేష్, దర్గయ్య, కష్ణయ్య, భూపాల్ తదితరులు పాల్గొన్నారు.