నవతెలంగాణ-మందమర్రి
రాత్రివేళ మూల మలుపుల వద్ద ప్రమాదాల నివారణకు కల్వర్టులు డివైడర్లకు రేడియం స్టిక్కర్లను అంటిస్తున్నట్లు ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు. బుధవారం ప్రమాదాల నివారణలో భాగంగా ఎస్‌ఐ రాజశేఖర్ ఆదేశాల మేరకు పెట్రోల్ కార్ సిబ్బంది ఏఎస్‌ఐ భగత్ ఆధ్వర్యంలో హోంగార్డ్ శ్రావణ్ కుమార్, ప్రధాన రహదారి వెంట మూల మలుపుల వద్ద ఉన్న కల్వర్టులకు రేడియం స్టిక్కర్లను అంటించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రాజశేఖర్ మాట్లాడుతూ రాత్రి వేళలో ప్రధాన రహదారి పక్కన గల కల్వర్టులు డివైడర్లకు చెట్లకు గుద్దుకొని తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. లైట్ ఫోకస్‌కి రేడియం స్టిక్కర్లు మెరుస్తుండడం వల్ల ప్రమాదాన్ని వాహనదారుడు గుర్తించే అవకాశం ఉంటుందని చెప్పారు.