ప్రమాదాల నివారణకు చెట్లకు రేడియం స్టికెర్స్

– ఎస్ఐఎస్ఐ ఏ కమలాకర్ పసర పోలీస్ స్టేషన్
నవతెలంగాణ-గోవిందరావుపేట

రాత్రివేళ మూల మలుపుల వద్ద ప్రమాదాల నివారణ కొరకు చెట్లకు రేడియం స్టిక్కర్స్ అంటిస్తున్నట్లు ఎస్ ఐ ఏ కమలాకర్ తెలిపారు. శుక్రవారం ప్రమాదాల నివారణలో భాగంగా సిబ్బందితో కలిసి 153 వ జాతీయ రహదారి వెంట మూల మలుపుల వద్ద ఉన్న చెట్లకు రేడియం స్టిక్కర్స్ అంటించారు. ఈ సందర్భంగా ఎస్ఐ కమలాకర్ మాట్లాడుతూ రాత్రి వేళలో రహదారి పక్కన గల చెట్లను గుద్దుకొని తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉండటం వల్ల ప్రమాదాల నివారణకై చెట్లకు రేడియం స్టిక్కర్స్ అతికించడం జరిగిందని అన్నారు. లైట్ ఫోకస్ కి రేడియం స్టిక్కర్లు మెరుస్తుండడం వల్ల ప్రమాదాన్ని వాహనదారుడు గుర్తించే అవకాశం ఉండి ప్రమాదం నివారణ జరుగుతుందని అన్నారు. వాహనదారులు ఇది గమనించి ప్రమాదాల నివారణలో కలిసి రావాలని సూచించారు.