నవతెలంగాణ-చేర్యాల: మహబూబ్ నగర్ లో ఈనెల 10 నుండి 13 వరకు జరిగే రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు పరిశీలకునిగా చేర్యాల పట్టణం పెద్దమ్మ గడ్డ హైస్కూల్ లో వ్యాయామ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న ఎండి.రఫత్ ఉమర్ ఎంపికయ్యారు. తన ఎంపికకు సహకరించిన హ్యాండ్ బాల్ రాష్ట్ర అధ్యక్షులు జగన్ మోహన్ రావు, ఎస్ జి ఎఫ్ కార్యదర్శి రాంరెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి పోటీలకు పరిశీలకునిగా ఎన్నికైన రఫత్ ను చేర్యాల వ్యాయామ ఉపాధ్యాయులు శుభాకర్ రెడ్డి,ఎం.కొండయ్య, అరుణ, విశాల, కవిత తోపాటు చేర్యాల స్పోట్స్ అధ్యక్ష, కార్యదర్సులు అభినందించారు.