
– గత ప్రభుత్వ తీరు పై త్రివ విమర్శలు
– అడ్డుకున్న ఛైర్మన్
నవతెలంగాణ – భువనగిరి రూరల్
రైతుబంధుపై జడ్పీ సమావేశంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సందర్భంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ గత ప్రభుత్వంపై రైతుబంధు రాళ్లు బోళ్లకు రాదని తీవ్ర విమర్శలు చేయగా, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి ఎమ్మెల్యేను అడ్డుకున్నారు.ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి సభ కాదని, సమస్య పైన మాట్లాడాలని సూచించారు. ఇద్దరు తీవ్ర విమర్శలు చేసుకోగా, ఎమ్మెల్యే మైక్ కట్ చేశారు. చివరకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య జోక్యం చేసుకొని,రైతుబంధు మూడున్నర ఎకరాల వారికి వచ్చిందని, విడుదలవారీగా ప్రభుత్వం అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నీటి ఎద్దడి పై అధికారులకు పలు సూచనలు చేయగా గొడవ సర్దుమని ఉంది. ఆలేరు,భువనగిరి నియోజకవర్గాలకు సరిపోను మిషన్ భగీరథ నీటిని అందించాలని, ఆలేరు నియోజకవర్గం లోని ఆలేరు పట్టణం,గుండాల మండలానికి వాటర్ సరిపోను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి కోసం ఈ ప్రభుత్వం సుమారు రెండు కోట్లకు పైగా ఖర్చు కోసం కేటాయించిందన్నారు. మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ సమస్యలను రివ్యూ సమావేశం నిర్వహించి, సమస్యను పరిష్కరించాలని తెలిపారు. పలుచోట్ల ప్రోటోకాల్ మార్చి కార్యక్రమాలు శిలాఫలకాలు బోర్డులు ఏర్పాటు చేస్తున్నారాని ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కావద్దని తెలిపారు.గుండాల మండల కేంద్రంలో సర్పంచ్ పేరు మరిచిపోయి,పదవి కాలం అయిపోయిన ఎమ్మెల్యే పేరు పెట్టడం ఎంతవరకు సమంజసం అని అడిగారు. అధికారులను ఆదేశించారు. తుర్కపల్లి మండలం నుండి యాదగిరిగుట్ట వరకు నిర్మాణం చేస్తున్న రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను సూచించారు. ఇప్పటివరకు యాదాద్రి జిల్లాలో అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు.అని ఇక మీదట కూడా ఇదే సమన్వయం కొనసాగించాలని తెలిపారు. ఎలక్షన్స్ సమయంలో పార్టీలు ఉండాలని,ఎలక్షన్స్ తర్వాత గ్రామాలు,పట్టణాలు అభివృద్ధి జరగాలన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ అధికారులందరూ చట్ట ప్రకారం పని చేయాలని, పాత పద్ధతిలో పనిచేస్తామంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. తాను ఇసుక మాఫియాను అంతే చేయడానికి మూడు కిలోమీటర్లు సి వై కాంట్రాక్టర్ వేసిన రోడ్డును జెసిబి లతో జాన్సన్ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వాన్ని చెడ్డ పేరు రాకుండా పనిచేయాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ హనుమంతు కె జండగె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకాలకు 500 రూపాయల సిలిండర్ పథకాలు గతంలో ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఆధార్ మొబైల్ నెంబర్ విద్యుత్ బిల్లు ఫోన్ నెంబర్ రేషన్ కార్డులోని ఫోన్ నెంబర్ సభ్యుల పేర్లతో లింక్ అయిన వారు మాత్రమే ప్రస్తుతం లబ్ధి పొందుతారని, మిగతావారు మండల ఆఫీసులో గాని మున్సిపాలి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఎక్సైజ్ సూపర్డెంట్ సైదులు మాట్లాడుతూ కల్తీ మద్యం గంజాయి డ్రగ్స్ నిర్మల పట్ల కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు, రాష్ట్రంలోని జిల్లాలో ఫ్రీ డ్రగ్స్ గా చేయుటకు కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. బెల్ట్ షాపులను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి స్థానానికి ప్రజాప్రతినిధుల సూచనల మేరకు బెల్ట్ షాపులకు మందు సప్లై చేసే వైన్ షాప్ లపై చర్యలు ఉంటాయని, ఇప్పటికే జిల్లాలోని 16 బెల్ట్ షాపులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో జెడ్పి సిఈఓ శోభారాణి, కాంగ్రెస్ జడ్పీ ఫోర్ లీడర్ డాక్టర్ కుడుదుల నగేష్, జడ్పిటిసిలు అనురాధ,నరేందర్ గుప్తా, గోలి ప్రణీత, ఎంపీపీలు నారల నిర్మల వెంకటస్వామి యాదవ్, నూతి రమేష్ రాజు, చీర శ్రీశైలం, జిల్లాస్థాయి అధికారులు అనురాధ, అన్నపూర్ణ, శంకరయ్య, కృష్ణయ్య, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.