ర్యాగింగ్‌ చేయడం నేరం

Ragging is a crime– సీపీ.డాక్టర్‌ బి.అనురాధ
నవతెలంగాణ-సిద్దిపేట అర్బన్‌
ర్యాగింగ్‌ చేయడం నేరమని, తోటి విద్యార్థులను ర్యాగింగ్‌ పేరుతో ఇబ్బందులకు గురి చేయొద్దని సీపీ. డాక్టర్‌ బి. అనురాధ అన్నారు. గురువారం ఆమె మాట్లాడుతూ విద్యార్థులు సీనియర్స్‌, జూనియర్స్‌ అనేది లేకుండా స్నేహపూర్వకంగా కలిసి మెలిసి విద్యనభ్యసించాలని సూచించారు. ర్యాగింగ్‌ లాంటి కేసుల్లో ఇరుకుంటే వారి బంగారు భవిష్యత్తు కోల్పోతారని, ర్యాగింగ్‌, ఈవ్‌ టీజింగ్‌ చేస్తూ దోషులుగా నిలవద్దని కోరారు. ర్యాగింగ్‌ కు పాల్పడే వారి వివరాలను డయల్‌ 100 కు తెలియజేసి పోలీసు సహాయం పొందవచ్చు సూచించారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపధ్యంలో అన్ని విద్యాసంస్థల్లో యాంటీ ర్యాగింగ్‌ అవగాహన సదస్సులు నిర్వహిం చాలని, యాంటీ ర్యాగింగ్‌ కమిటీలు ఏర్పాటు చేయాలని పోలీసు అధికా రులను, సిబ్బందిని ఆదేశించి నట్లు తెలిపారు.
పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయి
పోలీస్‌ శాఖలో పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని సీపీ డాక్టర్‌ బి. అనురాధ అన్నారు. గురువారం హెడ్‌ కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్‌ఐగా పదోన్నతులు పొందిన ఇద్దరు సీపీని కలసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రమోషన్‌ పొందిన ఏఎస్‌ఐలను సీపీ అభినందించి, రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందించాలని కోరారు.
సౖౖెబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
– చేర్యాల సీఐ ఎల్‌. శ్రీను
నవతెలంగాణ- కొమురవెల్లి
విద్యార్థులు కష్టపడి చదివి ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని చేర్యాల సీఐ ఎల్‌ శ్రీను అన్నారు. గురువారం కొమురవెల్లి జిల్లా పరిషత్‌ హై స్కూల్‌లో విద్యార్థిని విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, షీ టీమ్‌ నిర్వహిస్తున్న విధులను, షీ టీమ్‌ ద్వారా ఎలా రక్షణ పొందొచ్చనే అంశాల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ర్యాగింగ్‌, ఇవిటీజింగ్‌, పోక్సో, షీ టీమ్స్‌, యాంటీ హ్యుమెన్‌ ట్రాఫికింగ్‌ సైబర్‌ నేరాలు, నూతన చట్టాల గురించి వివరించారు. అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్‌ కాల్స్‌, మాటలు నమ్మవద్దని, సోషల్‌ మీడియాకు ఎంత దూరం ఉంటే భవిష్యత్‌ అంత బాగుంటుందని చెప్పారు. మహిళల భద్రత పోలీస్‌ డిపార్ట్మెంట్‌ ముఖ్య బాద్యత అన్నారు. చదువుకునే సమయములో చెడు అలవాట్లకు బానిస కావొద్దని, ప్రతి ఒక్కరూ చదువుపై దష్టి సారించాలని తెలిపారు. డ్రగ్స్‌ ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. చదువుకోవడం వల్ల భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందన్నారు. పిల్లలను చదివించటానికి తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని దష్టిలో ఉంచుకొని చదువుపై శ్రద్ధ వహించాలన్నారు. మహిళలను ఎవరైనా వేధింపులకు గురి చేసిన అవహేళనగా మాట్లాడిన వెంటనే డయల్‌ 100 లేదా సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌ షీటీమ్‌ నెంబర్‌ 8712667434 కు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమురవెల్లి ఏఎస్‌ఐ రమణమూర్తి, ఇన్చార్జ్‌ హెడ్మాస్టర్‌ కే. తిరుపతిరెడ్డి, హుస్నాబాద్‌ షీటీమ్‌ బందం సదయ్య , హెడ్‌ కానిస్టేబుల్‌, మహిళా కానిస్టేబుళ్లు స్వప్న, ప్రశాంతి, కానిస్టేబుళ్లు కష్ణ, శివకుమార్‌. తదితరులు పాల్గొన్నారు