
హలియా మున్సిపాలిటీ గీత కార్మిక సొసైటీ సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా కొమ్మనబోయిన రఘు గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం హాలియాలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో హాలియా మున్సిపాలిటీ గీత కార్మిక సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా పానుగుండ్ల సైదయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శిగా బల్మూరు శ్రీశైలం గౌడ్, డైరె క్టర్లుగా పులి సైదయ్య గౌడ్, పానుగుండ్ల వెంకన్న గౌడ్, కాకునూరి శేఖర్ గౌడ్, చింతపల్లి వెంకటయ్య గౌడ్, లింగాల రాంబాబు గౌడ్, తిరుమణి యాదగిరి గౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రఘు మాట్లాడుతూ గీత కార్మికుల సమస్యల కోసం పోరాటం చేస్తానని అన్నారు. తన ఎన్నికకు సహకరించిన గీత కార్మిక సొసైటీ సభ్యులకు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు అభినందనలు తెలిపారు.