
బీఆర్ఎస్ పార్టీ తిరుమలగిరి మండల శాఖ అధ్యక్షులు మున్సిపల్ కౌన్సిలర్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి జన్మదిన వేడుకలను పట్టణ బీఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం మున్సిపల్ కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం జిల్లా బిఆర్ఎస్ నాయకులు దూపటి రవీందర్, యాకుబ్ నాయక్, కందుకూరి బాబు మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా తిరుమలగిరి మండలంలో నీతి నిజాయితీ గల నాయకునిగా పేరు ఉన్న రఘునందన్ రెడ్డి అంచలంచలుగా ఎదిగి బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షునితోపాటు మున్సిపల్ కౌన్సిలర్ గా మాజీ వైస్ చైర్మన్ , మాజీ వైస్ ఎంపీపీ గా ఎన్నో పదవులను అదిరోహించారని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా కష్టం వచ్చినా అందుబాటులో ఉంటూ వారికి రక్షణ కల్పిస్తున్న నాయకుడు రఘునందన్ రెడ్డి అని అన్నారు. తన తండ్రి సంకేపల్లి పద్మనాభ రెడ్డి వారసత్వాన్ని నిలబెడుతూ మండలంలో అన్ని వర్గాల ప్రజల ఆధరాభిమానాలను చురగొన్నాడని వారన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మాజీ గ్రంథాలయ కమిటీ చైర్మన్ మోడేపు సురేందర్, మాజీ సర్పంచ్ దేవా, శ్రీను నాయక్, యాకూబ్ నాయక్, మహేశ్వరం జయచందర్ , మోడేపూ వీరయ్య ,మద్దేల చిన్ని, అనగందుల మల్లేష్, పి త్రిశూల్ అడ్డబొట్టు చారి ,జోషి తదితరులు పాల్గొన్నారు.