రఘువీర్ రెడ్డి కే  మాలలమద్దతు

– మాలమహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షులు లకుమాల మధుబాబు    
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్               
కాంగ్రెస్ పార్టీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి కే మాలల మద్దతు ఇస్తున్నట్లు  మాలమహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షులు లకుమాల మధుబాబు తెలిపారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు, మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జి. చెన్నయ్య  ఆదేశాల మేరకు శుక్రవారం మాలమహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షులు లకుమాల మధుబాబు  అధ్యక్షతన మాలమహానాడు జిల్లా కార్యాలయంలో మహిళా ముఖ్యకార్యకర్తల తో కలిసి  విలేకరుల సమావేశం ఏర్పాటు చేసారు. రాష్ట్ర మహిళా కార్యదర్శి సప్పిడి సావిత్రితో కలిసి నల్గొండ జిల్లా అధ్యక్షులు లకుమాలమధు బాబు మాట్లాడారు. నల్లగొండ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి కి మాల మహానాడు పూర్తి మద్దతు ప్రకటిస్తూనట్లు తెలిపారు. రఘువీర్ రెడ్డిని  భారీ మెజారిటీతో గెలిపించాలని, దళిత బహుజనులకు పిలుపునిచ్చారు.  బిజెపి పాలనలో దళిత గిరిజన మైనార్టీలతోపాటు మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వారిపై దాడులు నిత్యం జరుగుతున్నాయని, ఈ దేశ మెజారిటీ ప్రజలకు రక్షణతో పాటు ప్రజాస్వామ్యాన్ని పరి రక్షించాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలోమహిళా నాయకురాలు రమణ, నల్గొండ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు సప్పిడి కళ్యాణి, నాగార్జునసాగర్, నియోజకవర్గ అధ్యక్షురాలు ఎనమాల రాజేశ్వరి,  దేవరకొండ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు ఎనిక శారద, హుజూర్నగర్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మర్రి చంద్రకళ,  కోదాడ నియోజకవర్గ అధ్యక్షురాలు జ్యోతుల భవాని, సూర్యాపేట నియోజకవర్గ అధ్యక్షురాలు పెరుమాళ్ళ కుమారి, మిర్యాలగూడ నియోజకవర్గ అధ్యక్షురాలు మర్రి చంద్రకళ,  శాంతమ్మ,  లింగమ్మ, స్వర్ణ  తదితరులు పాల్గొన్నారు.