– 5.5లక్షల భారీ మెజార్టీతో గెలుపు
– కేవలం 4,500 ఓట్లతో బయటపడ్డ డీకే అరుణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల చరిత్రలో నల్లగొండ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి రికార్డు సృష్టించారు. బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డిపై ఏకంగా 5.59,905 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రఘువీర్‌కు 7,84,337 ఓట్లు రాగా సైదిరెడ్డికి 2,24,432 ఓట్లే పోలయ్యాయి, తెలంగాణ చరిత్రలో ఇదే అత్యధిక మెజార్టీ కావడం విశేషం. మహబూబ్‌నగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన డీకే అరుణ 4,500 పైచిలుకు ఓట్ల మెజార్టీతో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన వంశీచంద్ రెడ్డిపై గెలుపొందారు. అరుణకు 5,10,747 ఓట్లు రాగా వంశీకి 5,06,247 ఓట్లు పోలయ్యాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో అత్యధిక, అత్యల్ప మెజార్టీ నమోదైన నియోజక వర్గాలుగా నల్లగొండ, మహబూబాబాద్‌లు నిలిచాయి.