రాగి జావ పంపిణి

నవతెలంగాణ-చివ్వేంల
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మండలం కేంద్రంలో ని ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ కుమారి బాబు నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ మారినేని సుధీర్ రావు, ఎంపీడీఓ లక్ష్మి, ఎంఈఓ గోపాల్ రావు,సర్పంచ్ జూలకంటి సుధాకర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు తీకుల్లసాయిరెడ్డి, గోవిందరెడ్డి, బాబు నాయక్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.