– విద్యార్ధులకు జడ్జి శంకర్ శ్రీదేవి పిలుపు
– గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ అండ్ డ్రగ్స్ అవగాహన
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
విద్యారంగంలో ర్యాగింగ్ పెడధోరణులకు విద్యార్థులు దూరంగా ఉండాలని ఇబ్రహీంపట్నం ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి శంకర్ శ్రీదేవి సూచించారు. ర్యా గింగ్ మంచిది కాదన్నారు. ర్యాగింగ్‌కి పాల్పడి తమ విలువైన జీవితాన్ని వృథా చేసుకోవద్దని విద్యార్ధులకు గుర్తు చేశారు. ఇబ్రహీంపట్నంలోని గురునానక్ విద్యా సంస్థల్లో యాంటీ ర్యాగింగ్ అండ్ డ్రగ్స్‌పై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. జడ్జి మాట్లాడుతూ తెలం గాణలో యాంటీ డ్రగ్స్, ర్యాగింగ్ చట్టాలు, శిక్షలు కఠినం గా ఉన్నాయన్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలని చెప్పారు. ర్యాగింగ్‌కు పాల్పడితే అమలయ్యే చట్టాలను వివరించా రు. సీనియర్ అడ్వకేట్ రవి మాట్లాడుతూ.. విద్యార్ధులు ర్యాగింగ్‌కి పాల్పడితే సస్పెన్షన్, హాస్టళ్ల నుంచి బయటకు పంపిస్తామన్నారు. అడ్మిషన్ రద్దవుతుందని చెప్పారు. జీఎన్‌ఐటీ ప్రిన్సిపాల్ ఎస్.శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. యాంటీ ర్యాగింగ్ చట్టాలు, గురునానక్ ఇనిస్టిట్యూషన్స్ గైడ్ లైన్స్ గురించి వివరించారు. ర్యాగింగ్‌కి పాల్పడితే ఎలాంటి సివిల్, క్రిమినల్ చర్యలు ఉంటాయో వివరించారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని తల్లితండ్రులకు మంచిపేరు తీసుకోరావాల న్నారు. విద్యార్థినుల పట్ల గౌరవంగా ఉండాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో జేడీ డాక్టర్ పార్థసారథి, డైరెక్టర్ వెంకట్రావ్, జిల్లా అడిషనల్ సివిల్ జడ్జి జస్టిస్ నాగరాజు పాల్గొన్నారు.