బీజేపీ.. బీఆర్ఎస్ లకి రాహుకాలం  

– దుబ్బాక లో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే
– కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం
– బీజేపీ, బీఆర్ఎస్ రెండూ పార్టీలు ఒకటేనని ఆరోపణ
– ఒక్కసారి ఆశీర్వదించి ఓటేసి గెలిపించండి
– కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ- దుబ్బాక రూరల్ :  ప్రస్తుతం దుబ్బాక లో బీజేపీ, బీఆర్ఎస్ లకి  రాహుకాలం నడుస్తోంది. చేతి గుర్తుకు ఓటేస్తే దుబ్బాక పట్టిన రాహుకాలం పోతదని ఈసారి తనకు ఓటేసి గెలిపిస్తే ముత్యం రెడ్డి కళలు కన్న పాలనను ప్రజలకు అందిస్తానని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక అభ్యర్థి చెఱకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలోని నగరం, తాళ్ళ పల్లి, పోతారెడ్డిపేట, చిన్ననిజాం పేట, రామేశ్వరం పల్లి, కూడ వెళ్లి, అక్బర్ పేట్ గ్రామాల్లో చెఱకు శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించగా ఆయనకు మహిళలు మంగళ హారతులు పట్టి కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయా గ్రామాల్లోని రోడ్ షోలో మాట్లాడారు. రెండు సార్లు అధికారంలో వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో  విఫలమైందని, నోటిఫికేషన్ వేసిన పేపర్ లీకులు, లీకేజీలతో పాటు ప్రాజెక్టుల పేరు మీద అక్రమంగా  కేసిఆర్ వేల కోట్లను సంపాదించారని ఆరోపించారు.మూడేళ్ళలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాయ మాటలతో గెలిచి ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ పార్టీలు ఒకటేనని,మరోసారి ఆ పార్టీలకు ఓటేసి మూడోసారి మోసపోవద్దన్నారు.   4 నెలల్లో 160 గ్రామాలు తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నాననీ తాను ఎమ్మెల్యేగా గెలిచినా తర్వాత నియోజకవర్గంలో 10,261 ఇల్లు కట్టిస్తానని, అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీ అమలు చేస్తామని అన్నారు. మీ కష్టాలు తెలిసిన వ్యక్తిగా ముత్యం రెడ్డి లాంటి పాలనను శక్తి వంచన లేకుండా పని చేస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పాతూరీ వెంకట స్వామి గౌడ్, మహిళ అధ్యక్షురాలు కూతురు సుమలత చందు, మండల అధ్యక్షులు అక్కపల్లి బాల్ నర్స గౌడ్, ఉపాధ్యక్షులు గజభింకర్ అశోక్, కోనపురం బాలు, గ్రామ అధ్యక్షులు తదితరులు ఉన్నారు.