అప్లెక్స్‌ సోలార్‌ బ్రాండ్‌ అంబాసీడర్‌గా రాహుల్‌ ద్రావిడ్‌

హైదరాబాద్‌ : అప్లెక్స్‌ సోలార్‌ లిమిటెడ్‌ తన బ్రాండ్‌ అంబాసీడర్‌గా ప్రముఖ క్రికెటర్‌ రాహుల్‌ ద్రావిడ్‌ను నియమించుకున్నట్లు ప్రకటించింది. తొలిసారి తాము ప్రచారకర్తగా రాహుల్‌ ను ఎంచుకున్నామని ఆ సంస్థ మేనేజిం గ్‌ డైరెక్టర్‌ అశ్విని సెహగల్‌ తెలిపారు. ఇది తమ మార్కెట్‌ విస్తరణకు ఎంతో దోహదం చేయనుందని ఆయన విశ్వా సం వ్యక్తం చేశారు.