దేశాన్ని ప్రగతి భవిష్యత్తు వైపు నడిపించగలిగే ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ 

నవతెలంగాణ – జక్రాన్ పల్లి
భారత దేశాన్ని ప్రగతి భవిష్యత్తు వైపు నడిపించగలిగే ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ అన్నారు.  జక్రాన్ పల్లి మండల్ లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జక్రాన్ పల్లి మండల్ కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నిన్నటి త్యాగాలకు వారసుడు రేపటి తరానికి మార్గదర్శకులు భారతదేశాన్ని ప్రగతి భవిష్యత్తు వైపు నడిపించగలిగే ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారికి జన్మదిన వేడుకలు నిర్వహించి జక్రాన్ పల్లి గ్రామంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జక్రాన్ పల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సొప్పరి  వినోద్ ,మాజీ సర్పంచ్ కాటిపల్లి నర్సిరెడ్డి ,ఎంపిటిసి 1 గడ్డం గంగారెడ్డి, గడ్డం సురేష్ ,జైడి మల్లేష్, రాజు ,మండల యూత్ కాంగ్రెస్ సెక్రెటరీ అరికెలా అభిలాష్ ,మండల యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ కేశ్పల్లి ప్రణయ్, జిల్లా సెక్రెటరీ గన్న  లక్ష్మణ్, డిష్ రాజు, దాసు, మైనార్టీ మండల అధ్యక్షులు సైకిల్ టెక్స్ అక్బర్, సొప్పరి సుధీర్, ప్రశాంత్ ప్రేమ్ కుమార్, జనార్ధన్, రంజిత్, మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.