రాహుల్‌ గాంధీ బైక్‌ ర్యాలీలో అపశృతి

Rahul Gandhi's bike rally caused chaos– కొండ సురేఖకు తప్పిన ప్రమాదం
నవతెలంగాణ- భూపాలపల్లి
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ భైపాలపల్లి పర్యటనలో నిర్వహించిన బైక్‌ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా చెల్పూర్‌ జెన్కో నుంచి జిల్లా కేంద్రంలోని బాంబుల గడ్డ వరకు కాంగ్రెస్‌ నేతలు కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ బైక్‌ నడుపుతూ కిందపడిపోయారు. కాగా స్వల్ప గాయాలతో ఆమె బయటపడ్డారు.