రాహుల్‌ గాంధీ రోడ్‌ షోను జయప్రదం చేయాలి

రాహుల్‌ గాంధీ రోడ్‌ షోను జయప్రదం చేయాలి– కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాయం
నవతెలంగాణ-బూర్గంపాడు
ఏఐసీసీ అగ్ర నాయకులు రాహుల్‌ గాంధీ శుక్రవారం మణుగూరులో చేపట్టనున్న రోడ్‌ షో, కార్నర్‌ మీటింగ్‌ను జయప్రదం చేయాలని పినపాక నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బూర్గంపాడు మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో గురువారం మిత్రపక్షాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాయం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా మణుగూరు చేరుకుంటారని అక్కడ నుంచి రోడ్‌ షోతో పాటు, కార్నర్‌ మీటింగ్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. నాయకులు అధిక సంఖ్యలో హజరై రాహుల్‌ గాంధీకి బ్రహ్మరధం పట్టాలని ఆయన కోరారు. అనంతరం మాజీ ఎంపీటీసీ బీమ్లాతో పాటు పలువురు కాంగ్రెస్‌ పార్టీలో చేరగా పాయం వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్‌ తూళ్లూరి బ్రహ్మయ్య, సీపీఐ రాష్ట్ర నాయకులు బి.ఆయోధ్య, మిత్రపక్షాల నాయకులు బట్టా విజయగాంధీ, దుగ్గెంపూడి కృష్ణారెడ్డి, మువ్వా వెంకటేశ్వరరావు, కన్నెదారి రమేష్‌, మహ్మదాఖాన్‌, పోతిరెడ్డి వెంకటేశ్వ ర్రెడ్డి, తాళ్ళూరి చక్రవర్తి, బర్ల నాగమణి, గోనె రేణుక, వారాల వేణు, కైపు లక్ష్మీనారయణరెడ్డి, భూక్యా సేవా లాల్‌, బాణోత్‌ నర్సింహ, తదితరులు పాల్గొన్నారు.
అశ్వాపురం : మణుగూరు పట్టణంలో నేడు జరుగు ఏఐసీసీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ రోడ్‌ షోకు కాంగ్రెస్‌ పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు, నాయుకులు, మద్దతు దారులు అన్నీ వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య కోరారు. గురువారం మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు చేసిన సోనియా గాంధీ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని, ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో, ఎంపీపీ ముత్తినేని సుజాత, గాదె కేశవరెడ్డి, ఓరుగంటి రమేష్‌, చంద్రకళ, పోడియం అనిల్‌ కుమార్‌, బట్టా సత్యనారాయణ, బొబ్బాల నాగేశ్వరరావు, ఎస్కే గాలిబ్‌, వలబోజు మురళి, సదర్‌ లాల్‌, మట్టా వీర భద్రా రెడ్డి పాల్గొన్నారు.