రేపు రాహుల్‌గాంధీ పర్యటన

రేపు రాహుల్‌గాంధీ పర్యటన– ఒకే రోజు ఐదు నియోజక వర్గాల్లో ప్రచారం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ శుక్రవారం రాష్ట్రానికి రానున్నారు. రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగ్‌లు, పాదయాత్రలు చేయనున్నారు. ఒకే రోజు పినపాక, నర్సంపేట, వరంగల్‌ తూర్పు, వరంగల్‌ పశ్చిమ, రాజేంద్రనగర్‌ నియోజక వర్గాల్లో ప్రచారాన్ని నిర్వహిస్తారు. శుక్రవారం ఢిల్లీ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలిక్యాప్టర్‌లో ఉదయం 11 గంటలకు పినపాకకు చేరుకోనున్నారు. రోడ్‌ షో, కార్నర్‌ మీటింగ్‌ పాల్గొంటారు. పినపాక నుంచి నర్సంపేటకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకు నర్సంపేట లో ప్రచారం నిర్వహిస్తారు. నర్సంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా వరంగల్‌ ఈస్ట్‌ చేరుకుంటారు. ఆ నియోజకవర్గంలో సాయంత్రం నాలుగు గంటలకు పాదయాత్ర చేయనున్నారు. వరంగల్‌ ఈస్ట్‌ నుంచి వెస్ట్‌కు వెళ్ళనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో సభలో మాట్లాడుతారు. అనంతరం రాహుల్‌గాంధీ ఢిల్లీ వెళ్లనున్నారు.