
– లక్కారోలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం
– భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
ఒకవైపు రాహుల్ జోడోయాత్ర చేస్తుంటే…మరోవైపు ఇండియా కూటమి నుండి ఇతర పార్టీలు కాంగ్రెస్ చోడో యాత్ర చేస్తున్నాయని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం వేల్పూర్ మండలం లక్కొరా గ్రామంలోని ఏ ఎన్ జి ఫంక్షన్ హాల్ లో బాల్కొండ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు బిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిముఖ్య అతిథిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే వేముల మాట్లాడుతూ… దేశంలో అధికారం లోకి వచ్చే పరిస్థితులు లేవన్నారు.పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తేనే హామీలు వందశాతం నెరవేరుతాయి అని ముఖ్యమంత్రి అనడం హామీల అమలు నుండి దూరంగా పారిపోవడమేనన్నారు.అధికారంలోకి రాగానే అమలు చేస్తానన్న హామీలు పార్లమెంట్ ఎన్నికల లోపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అమలు పరచాలని డిమాండ్ చేశారు.లేకుంటే కాంగ్రెస్ పార్టీ ని రాబోవు కాలంలో ప్రజలు బొందపెట్టడం ఖాయమన్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో అహర్నిశలు కష్టపడి గెలిపించిన కార్యకర్తలకు ధన్యవాదాలు.రాష్ట్రంలో ఒకవిధమైన పరిస్థితి ఏర్పటినప్పటికి బాల్కొండ లో మూడవ సారి గెలవటం మామూలు విజయం కాదన్నారు.
తెలంగాణ వనరులు దోపిడీకి గురవుతున్న వేల ఒక్కడుగా బయలుదేరి అవిశ్రాంత పోరాటం చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అన్నారు.సాధించిన తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్ వన్ గా నిలిపిన గొప్ప వ్యక్తి కేసీఆర్ కు దక్కవల్సిన గౌరవం దక్కలేధనే బాధ ప్రజలందరిలో ఉందని తెలిపారు.బిఅర్ఎస్ అధికారం పోవటానికి ఎన్నో కారణాలు ఉన్నాయని, కర్ణుడి చావుకు వంద కారణాలుఅన్నట్లు జరగిందన్నారు.
కేవలం 1.8 శాతం ఓట్ల తేడాతో మాత్రమే వొడిపోయాము తప్ప ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదన్నారు.అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పనిచేయటం వల్ల పార్టీ నిర్మాణానికి పూర్తి స్థాయి సమయం ఇవ్వలేక పోయామని తెలిపారు.తెలంగాణ బాగుపడితే పార్టీ బాగున్నట్లే అని నమ్ముకుని పార్టీ సంస్థాగత నిర్మాణం పై నిర్లక్ష్యం చేసామన్నారు.రాజకీయాలు,అభివృద్ధి వేరు వేరు అని గ్రహించలేదన్నారు.రాష్ట్ర ప్రజలంతా తన బిడ్డలే అనే భావనతో కేసీఆర్ సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేశారని, దక్షణ భారత దేశంలో ఏ రాష్ట్రంలో కూడా గత నాలుగు దశాబ్దాలుగా రెండు సార్లు కంటే ఎక్కువ ఏ పార్టీ లు గెలవలేదని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు పాలిస్తుందని నమ్మకం లేదని పేర్కొన్నారు.వాళ్ళు ధర్మ బద్ధంగా గెలవలేదని, గుంటకాడ నక్కల్ల కాంగ్రెస్ నాయకులు పనిచేశారన్నారు.అర్థం పర్థం లేని చేసిన అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మారని, బిఅర్ఎస్ పార్టీ చేసుకున్న చిన్న చిన్న పొరపాట్ల వల్ల చిన్న స్పీడ్ బ్రేకర్ వచ్చింది అంతే అన్నారు.కాంగ్రెస్ పార్టీ అబద్ధపు ప్రచారాలను పసిగట్టలేకపోయామని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి సవాల్..ప్రజాదర్బార్ లో ఒక్కరోజుమత్రమే పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పత్తాలేకుండా ఎక్కడికి వెళ్లారని, ప్రజా దర్బార్ లో ఇపుడు అధికారులు తప్ప ముఖ్యమంత్రి కలవటం లేదన్నారు.ప్రగతి భవన్ లో కాకుండా వేరే చోట ముఖ్యమంత్రి ఎందుకు ఉంటున్నారో సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. అధికారం లోకి వచ్చిన కేవలం 50 రోజుల్లో 14 వేల కోట్లు అప్పులు ఎందుకు చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.దక్షణ భారత దేశంలో ఏ రాష్ట్రం లో అయిన గత నాలుగు దశాబ్దాలుగా రెండు సార్లు కంటే ఎక్కువ ఏ పార్టీ లు గెలవలేదన్నారు. దళిత బందు వంటి పధకాలను ప్రతిపక్షాలు రాజకీయానికివాడుకున్నాయన్నారు.అమలుకు నోచుకోని 420 మోసపూరిత హామీలను ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీయాలని సూచించారు.రుణ మాఫీ, రైతుబందు,200 యూనిట్ల ఉచిత కరెంట్, పెన్షన్, తులం బంగారం, మహాలక్ష్మి, చేయూత పథకాలపై గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులను బాజాప్త నిలదీయాలన్నారు.పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయటమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే హామీలు అమలు చేయమని చెప్తున్న సిఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.రేవంత్ రెడ్డి నీ గురువు చంద్ర బాబు నాయుడు, వై ఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి వారితోనే కాలేదని బిఅర్ఎస్ పార్టీ నీ అడ్డుకోవటం నీవల్ల అవుతుందా? అని ప్రశ్నించారు.మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ బిడ్డలమని, మీ తాటాకు చప్పుళ్లకు కేసీఆర్,ఆయనతో ఉన్న మేము బయపడమన్నారు. ఇప్పుడు అతిగా ప్రవర్తించే అధికారులకు కూడా జాగ్రత్తగా ఉండాలని లేదంటే మా సమయం వచ్చినప్పుడు మీరూ అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలపై మాట్లాడిన వీడియో లను మంత్రి స్క్రీన్ పై ప్రదర్శించారు.
ఎమ్మేల్యే పల్లా రాజేశ్వర రెడ్డి మాట్లాడుతూ..బీఅర్ఎస్ పాలనలో ప్రజలు లబ్ధి పొందారు తప్ప కార్యకర్తలు నిస్వార్థంగా పనిచేశారన్నారు.
తెలంగాణను తీసుకొచ్చి బాగుచేసిన తెలంగాణ పార్టీ బిఅర్ఎస్ అన్నారు.ఇలాంటి పార్టీ కార్యకర్తలు హామీల అమలు కోసం బరి గీసి పోరాడుతారన్నారు. కేసీఆర్ అమలు చేసిన పథకాలు ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని తెలిపారు.కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గినాయన్నారు. 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని,
ఇపుడు 5గంటల కరెంటు కూడా సరిగా రైతులకు అందటం లేదన్నారు.హామీల అమలు పై నిలదీస్తే కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పలేక ఆక్రోశంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.బిఅర్ఎస్ ప్రభుత్వం కొన్నట్లు రైతుల వద్ద వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు.కాళేశ్వరం పై నోటికి వచ్చిన రీతిలో తప్పుడు ప్రచారం చేసి అబద్ధాన్ని నిజం అని నమ్మించారన్నారు.రంగనాయక సాగర్, కొండ పోచమ్మ ప్రాజెక్ట్ లు ఎక్కడి నుండి వచ్చాయన్నారు.రాష్ట్ర లో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి ఎలా వచ్చిందో ఆలోచన చేయాలని కోరారు.తెలంగాణలో 99 శాతం 10 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులే ఉన్నారని తెలిపారు.బిఅర్ఎస్ పార్టీ రైతు బందు కోసం కేటాయించిన 7500 కోట్ల నిధులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు.రైతు బందు అడిగితే చెప్పుతో కొట్టమని మంత్రి కోమటి రెడ్డి అనటం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు. కేసీఆర్ హాయంలో ఉద్యోగాలు ఇవ్వలేదని అసత్య ప్రచారం చేశారని, రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అన్నారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం సొమ్ము ఒక్కడిధి సోకు ఒకడిది అన్న చందంగా వ్యవహరిస్తుందని, స్టాఫ్ నర్సు పోస్టులకు నోటిఫికేషన్ ఇచి, పరీక్షలు నిర్వహించింది బిఅర్ఎస్ ప్రభుత్వం అయితే కాంగ్రెస్ వాళ్లు తామే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవ చేశారు.కేసీఆర్ పేరుతో ఉన్న పథకాల పేర్లు మారుస్తున్నారని, ఒకవేళ కేసీఆర్ కూడా అదేపని చేసి ఉంటే రాజీవ్ గాంధీ పథకాల పేర్లు ఉండేవి కావన్నారు.బిఅర్ఎస్ ప్రజా ప్రతినిధుల పై అక్రమ కేసులు బనాయిస్తున్నరని ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు డాక్టర్ మధు శేఖర్, కోటపాటి నరసింహ నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపిపి, జెడ్పిటిసి లు సర్పంచ్, ఎంపిటిసి లు, మండల, గ్రామ స్థాయి నాయకులు ,ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
