రాహుల్, ప్రియాంక  సభను విజయవంతం చేయాలి: పాలడుగు వెంకటకృష్ణ

నవతెలంగాణ-గోవిందరావుపేట
నేడు వెంకటాపురం మండలం రామప్పలో నిర్వహించే రాహుల్ గాంధీ ప్రియాంకల భారీ బహిరంగ సభను ప్రజల అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ పిలుపునిచ్చారు. మంగళవారం మండలం లోని లక్ష్మీపురం గ్రామంలో కర్లపాల్లి క్లస్టర్ ఇంచార్జులు రసపుత్ సీతారాంనాయక్, చింత క్రాంతి, తండా కృష్ణ  ఆధ్వర్యంలో క్లస్టర్ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ హాజరై మాట్లాడారు.  దేశానికి స్వాతంత్య్రం ఇచ్చిన, తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిన అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని అన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ నేతల వారసులైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లు ఎన్నికల ప్రచారం సందర్భముగా ములుగు జిల్లా రామప్ప ఆలయానికి విచ్చేసి పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం మొదలు పెడుతున్న శుభ సందర్భంగా ములుగు జిల్లా నుండి వేలాదిగా తరలి వచ్చి ఘన స్వాగతాలు పలకాలని కోరారు. అలాగే ములుగు నియోజక వర్గ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పేదలకు సంక్షేమ పథకాలు అందాయని, ఉచిత విద్యుత్, ఏక కాలంలో రైతు రుణమాఫి, రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇండ్లు, విద్యార్థులకు ఫీజు రీ – ఇంబార్సుమెంట్, ఇందిరా జల ప్రభ, సబ్సిడీ ఎరువులు, సబ్సిడీ విత్తనాలు, ఉచిత ఎమర్జెన్సీ సేవలు లాంటి అత్యున్నత పథకాలతో పేదల అభివృద్ధి జరిగిందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, సీతక్క  ములుగు జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తారాన్నారు.ఈ కార్యక్రమంలో గోవిందరావుపేట మండల జిల్లా నాయకులు, మండల నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, గ్రామ నాయకులు, యూత్ నాయకులు, మహిళా నాయకు రాల్లు మరియు కార్యకర్తలు తదితర నాయకులు పాల్గొన్నారు.