– ఆరు రోజులపాటు ఎన్నికల ప్రచారం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆరు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఆయన టూర్ ఖరారైనట్లు తెలుస్తున్నది. రాహుల్ 23 వరకు ఇక్కడే ఉండనున్నట్లు సమాచారం. 17న పాలకుర్తి, వరంగల్, భువనగిరిలో కాంగ్రెస్ నిర్వహించే సభల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి వరుసగా ఆరు రోజుల పాటు సభల్లో పాల్గొననున్నారు.ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రతీ నియోజకవర్గం లోనూ పార్టీకి చెందిన అగ్రనేతల పర్యటనలు ఉండేలా కాంగ్రెస్ కసరత్తులు చేస్తున్నది. ఈ క్రమంలోనే ఒకే రోజు కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సమావేశాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నది.