రాహుల్‌ శతకం

Rahul's century– హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌ 410/10
జైపూర్‌: యువ వికెట్‌ కీపర్‌ రాహుల్‌ రాడేశ్‌ (100, 268 బంతుల్లో 7 ఫోర్లు) సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్‌ రాహుల్‌ సింగ్‌ (66, 100 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌), చామ మిలింద్‌ (48, 77 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. దీంతో రాజస్థాన్‌తో రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 144 ఓవర్లలో 410 పరుగుల భారీ స్కోరు సాధించింది. రాజస్థాన్‌ బౌలర్‌ అజరు సింగ్‌ (5/139) ఐదు వికెట్లు తీసుకున్నాడు. రాజస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 117/1తో పోరాడుతోంది. ఓపెనర్‌ అభిజిత్‌ (44 నాటౌట్‌), మహిపాల్‌ లామ్రోర్‌ (58 నాటౌట్‌) అజేయంగా ఆడుతున్నారు. రెండో రోజు ఆట ముగిసేసరికి రాజస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 293 పరుగుల భారీ వెనుకంజలో కొనసాగుతుంది.