– నాగాలాండ్‌తో రంజీ పోరు
సోవిమా (నాగాలాండ్)
పసికూన నాగాలాండ్‌పై హైదరాబాద్ పంజా విసిరింది. రాహుల్ సింగ్ (214, 157 బంతుల్లో 23 ఫోర్లు, 9 సిక్స్‌లు) డబుల్ సెంచరీతో దుమ్మురేపగా, కెప్టెన్ తిలక్ వర్మ (100 నాటౌట్, 112 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ శతకంతో చెలరేగాడు. రాహుల్, తిలక్‌లకు ఓపెనర్ తన్మరు అగర్వాల్ (80, 109 బంతుల్లో 12 ఫోర్లు) జత కలవటంతో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసింది. రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్‌లో తొలి మ్యాచ్‌లో నాగాలాండ్‌పై తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన హైదరాబాద్ 76.4 ఓవర్లలో 474/5 పరుగులకు డిక్లరేషన్ ప్రకటించింది. చందన్ సహాని (23), ప్రజ్ఞరు రెడ్డి (19), రవితేజ (21 నాటౌట్) రాణించారు. తొలి రోజు చివరి సెషన్లో బ్యాటింగ్‌కు వచ్చిన నాగాలాండ్ 439 పరుగుల వెనుకంజలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లలో 35/1తో పోరాడుతోంది.