– సైబర్ మోసాల పై ప్రజలకు అవగాహన కల్పించాలి
నవతెలంగాణ – రాయికల్
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శనివారం రాత్రి ఆకస్మికంగా రాయికల్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు,వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించారు.పోలీస్ స్టేషన్ నుండి రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నిర్వహిస్తున్నాయని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడెక్కడ ఎన్ని బిట్స్ నడుస్తున్నాయని తెలుసుకొని ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని,బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24×7 గస్తీ నిర్వహించాలని సూచించారు. ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. అధికారులు,సిబ్బందిఅందరూ విధులు సక్రమంగా నిర్వహించడం ద్వారానే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని సూచించారు. ప్రస్తుత రోజుల్లో మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి కావున ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్, టౌన్ సిబ్బంది అందరూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిపై పై ఎక్కువ దృష్టి సారించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు.ఎస్పీ వెంట డిఎస్పీ రఘు చందర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, రూరల్ సీ.ఐ కృష్ణారెడ్డి,ఎస్.ఐ అశోక్ ఉన్నారు.