పోచారం ప్రధాన కాలువ బ్రిడ్జ్ పై రేలింగ్ ఏర్పాటు..

– నవతెలంగాణ ఎఫెక్ట్..
నవతెలంగాణ నాగిరెడ్డిపేట్ : నాగిరెడ్డిపేట్ మండలంలోని పోచారం ప్రధాన కాలువపై చీనురు వాడి గ్రామాలకు వెళ్లే రహదారి పై నిర్మించిన బ్రిడ్జ్ పై రేయిలింగ్ ఏర్పాటు చేయడానికి ఐదు లక్షల 50 వేలు మంజూరు కావడం జరిగిందని చీనురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మురళి గౌడ్, నారాయణరెడ్డి మంగళవారం తెలిపారు. గత గత పది రోజుల క్రితం సైడ్ వాల్ కూలడంతో ప్రమాదకరంగా మారిన బ్రిడ్జి నిర్మాణం అనే కథనం నవ తెలంగాణలో ప్రచురితమైంది ఈ విషయంపై స్పందించిన సంబంధి శాఖ అధికారులు రైలింగ్ ఏర్పాటు చేయడానికి ఐదు లక్షల 50 వేలు మంజూరి చేయించినట్టు ఆయన తెలిపారు.