
– కొత్తపల్లి శివకుమార్ సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్..
జిల్లా కేంద్రంలోని కుడ కుడ లో నివసిస్తున్న పేదల ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని,మాపై మా పార్టీపై పనిగట్టుకొని కొందరు కిరాయి వ్యక్తులు,వారి వెనుక ఉండి నడిపిస్తున్న రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ప్రజావాణి లో కలెక్టర్ కి సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా పార్టీ కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల నుండి నిలువ నీడలేని నిరుపేదలకు మా పార్టీ ఆధ్వర్యంలో ఇంటి స్థలాల కోసం గుడిసెలేసి అనేక నిర్బంధాలు, కేసులు ఎదుర్కొని పోరాటం చేస్తుంటే 2022లో కొందరు గత అధికార పార్టీ నాయకులు మాపై, మహిళలపై దాడులు చేయించి పేదలకు ఇంటి స్థలాలు రాకుండా అడ్డుకున్నారు అన్నారు. ఈ ప్రభుత్వ భూమిని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రెడ్డి కమిటీ హాల్ కు రాస్తే నోరు విప్పని వారు, తిరిగి అదే భూమిలో పేదల గుడిసెలు వేసుకొని జీవిస్తుంటే వారికి ఇంటి పట్టాలు వస్తాయి అనే ఉద్దేశం తోటి కొందరు రాకుండా అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ మా మీద మా పార్టీ మీద చెడు ప్రచారం చేస్తున్నారు అన్నారు. ఈ విషయమై ఎంక్వయిరీ చేయించి మా పైన చెడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా యుద్ధ ప్రాతిపదికన ఎంక్వయిరీ చేయించి అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించి చెడు ప్రచారం చేసే వారి పైన చర్యలు తీసుకుంటామని,త్వరలోనే అర్హులైన వారికి పట్టాలిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.ఈ కార్యక్రమంలో పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్,పార్టీ పట్టణ కార్యదర్శి ఎస్కె గులాం హుస్సేన్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఎస్కే సయ్యద్ హుస్సేన్,పార్టీ డివిజన్ నాయకులు పిడమర్తి లింగయ్య,ఎస్కే.సయ్యద్, పిఓడబ్ల్యు జిల్లా కోశాధికారి జయమ్మ, సహాయ కార్యదర్శి సంతోషి,పద్మ,గౌరమ్మ, పద్మ, మోహన్,అంజయ్య,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.