బెంగళూరులో వర్ష బీభత్సం

బెంగళూరులో వర్ష బీభత్సం– 133 ఏండ్ల రికార్డు బ్రేక్‌
బెంగళూరు : బెంగళూరులో వర్షం బీభత్సం సృష్టించింది. ఒక్కరోజులోనే 111.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 133 ఏండ్ల తర్వాత ఈ వర్షపాతం నమోదై రికార్డు సృష్టించిందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. 1891 జూన్‌ 16న బెంగళూరులో ఒక్కరోజులోనే 101.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ రికార్డును ఆదివారం రాత్రి కురిసిన వర్షపాతం బ్రేక్‌ చేసిందని ఐఎండీ పేర్కొంది. కర్ణాటక రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల రాకతో బెంగళూరులో భారీ వర్షం కురిసిందని తెలిపింది. ఈ నేపథ్యంలో బెంగళూరుకు ఎల్లో అలర్జ్‌ను జారీ చేసింది. జూన్‌ 3 నుంచి 5 వరకు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది.