
పట్టణంలో రాఖి పౌర్ణమి సందర్భంగా బస్టాండ్ పాత బస్టాండ్, మామిడిపల్లి చౌరస్తా ,పెర్కిట్ తదితర ప్రాంతాలలో సోమవారం రాఖి దుకాణాలు సందడిగా మారినవి. కాగా మధ్యాహ్నం కురిసిన భారీ వర్షంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు దీంతోపాటు పట్టణంలో రోజురోజుకు ట్రాఫిక్ పెరుగుతోంది. పట్టణంలో పెరిగిన ట్రాఫిక్ కు అనుగుణంగా ఇటీవల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సైతం ఏర్పాటయింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా కొత్త బస్టాండ్ వద్ద కాసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అంతలోనే ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. వాహనదారులు నిర్మల్- నిజామాబాద్, మెట్పల్లి- నిజామాబాద్ వెళ్లాలంటే ఆర్మూర్ మీదుగానే వెళ్లాల్సి వస్తోంది.