– మరోసారి రికార్డు ధర పలికిన ఆల్‌నైన్స్
– ఒక్కరోజే 51.17 లక్షల ఆదాయం
– జేటీసీ రమేష్
నవతెలంగాణ-సిటీబ్యూరో
రవాణాశాఖలో మరోసారి ఆల్ నైన్స్ నంబర్ రికార్డు ధర పలికింది. బుధవారం ఖైరతాబాద్ ఆర్టీఏలో నిర్వహించిన ఫ్యాన్సీ నెంబర్ల ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో టీజీ 09 ఏ 9999 నంబర్‌కు అనుహ్యమైన పోటీ కనిపించింది. హానర్ డెవలపర్స్ ప్రయివేటు లిమి టెడ్ సంస్థ ఈ నంబర్ కోసం ఏకంగా 19.51లక్షలు చెల్లించి సొంతం చేసుకుంది. ఫలితంగా ఆ శాఖకు ఒక్కరోజే ఫ్యాన్సీ నెంబర్ల ఈ వేలం ద్వారా సుమారు 51.17లక్షలకుపైగా ఆదాయం సమకూరిందని హైదరాబాద్ జాయిం ట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్(జేటీసీ) సి.రమేష్ తెలిపారు.
ఇదిలావుంటే ఆన్‌లైన్ ఈ-వేలంలో ఎన్‌జీ మైండ్ ఫ్రేమ్ ప్రయివేట్ లిమిటెడ్ తమ విలువైన కారు కోసం రూ.8.25లక్షలు వెచ్చించి టీజీ09 బీ 0001 నంబర్‌ను దక్కించుకుంది. అదే విధంగా టీజీ09 బీ 0009 నంబర్‌ను అమరం ఆక్షర రెడ్డి తమ ఖరీదైన కారు కోసం రూ. 6.66లక్షలు చెల్లించి సొంతం చేసు కున్నా రు. కాగా టీజీ09 బీ 0006 నంబర్‌ను ఎఎంఆర్ ఇండియా లిమిటెడ్ సంస్థ రూ.2.91 లక్షలు, టీజీ09బీ 0005 నంబర్‌ను గ్రేటర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ 2.50లక్షలు చెల్లించి కైవసం చేసుకున్నా యి. అదేవిధంగా టీజీ09బీ 0019 నంబర్‌ను మోల్డ్ టెక్ టెక్నాలజీస్ లిమిటెడ్ రూ.1.30లక్షలు వెచ్చించి సొంతం చేసుకుంది. ఫలితం గా ఒక్కరోజులో రవాణాశాఖ ఖాజానాకు రూ.51,17, 514 ఆదాయం చేకూరినట్టు జేటీసీ రమేష్ తెలిపారు.