గాలి దుమారంతో వర్షం

– పలుచోట్ల నేలకొరిగిన భారీ వృక్షాలు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండలంలో ఆదివారం సాయంత్రం పెద్ద ఎత్తున గాలి దుమారం రేగింది. గాలితో కూడిన వచ్చిన వర్షానికి పలుచోట్ల భారీ వృక్షలు నేలకు ఒరిగిపోగా, పూరి గుడిసెలు, రేకుల పైకప్పులు లేచిపోయాయి. భద్రాచలం చర్ల ప్రధాన రహదారి ఆంధ్ర కేసరి నగర్‌ వద్ద రహదారికి అడ్డంగా చింత చెట్టు పడిపోవడంతో రాకపోకలు సాగక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అతివేగంతో వీచిన గాలులకు మండల ప్రజలు భయాందోళనకు గురయ్యారు అని చెప్పవచ్చు.