వర్షాలతో పంటలకు ప్రాణం

Rains give life to crops– ఆరుబట్టే వేళ ఆదుకున్న వర్షాలు
– పత్తి, కంది, ఇతర మెట్ట పంటలకు ఆసరా
– తెగుళ్ల బారిన పడకుండా సస్య రక్షణ చర్యలు
– ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
– కాస్త గరువు ఇవ్వడంతో పైర్లకు ఊరట
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
వర్షాభావంతో ఒట్టిపోయే దశలో కురిసిన వర్షాలతో మెట్ట పంటలకు ప్రాణం వచ్చినట్లైంది. ఉ మ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల పాటు భారీ వ ర్షాలు కురిశాయి. వర్షపు నీరు చేరడంతో కాల్వలు, వా గులు, చెర్వులు, కుంటలు ఉప్పొంగాయి. జలాశ యాలకు జల కళ సంతరించుకుంది. మరో పక్క ఆరుతడి, మెట్ట పంటలకు ఇటీవల కురిసన వర్షాలు ఎంతో మేలు చేశాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో సాగైన మెట్ట పంటలు నీటి ఎద్దడితో వాడుబడుతున్న సమయంలో వర్షాలు కురియడంతో పైర్లకు ఊరట లభించింది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షం
మూడు రోజుల పాటు ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయి నుంచి మోస్తరు వర్షాలు కురి శాయి. ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. ఈ నెల 3, 4, 5, 6 తేదీలలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురి యడంతో లోతట్టు ప్రాంతాల్లో వరదలు ఉప్పొం గాయి. తగ్గిన చెర్వులు, కుంటల నీటి మట్టం ఈ వ ర్షాలతో తిరిగి నీటి మట్టం పెరిగింది. చాలా చోట్ల చె ర్వులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 28 మండలాల్లోనూ వర్షాలు కురిశాయి. బుధవారం గుమ్మడిదల మండలంలో 40.6, జిన్నారంలో 31.6, ఆర్‌సీపురంలో 27.6, హ త్నూర 25.2, నిజాంపేటలో 21.3, అమీన్‌పూర్‌లో 19, పటాన్‌చెరులో 16.6, అందోల్‌ 22.5, పుల్కల్‌ 19.7, సదాశివపేటలో 14.4, వట్‌పల్లిలో 11, సం గారెడ్డిలో 18.2, కల్హేల్‌లో 19.4 మిల్లీ మీటర్ల వర్షా పాతం నమోదైంది. మిగతా మండలాల్లో 2 నుంచి 10 మిల్లీ మీటర్ల వరకు వర్షాపాతం నమోదైంది. సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లోని అన్ని మండలాల్లో నాలు గు రోజుల పాటు వర్షాలు కురిశాయి. సగటు వర్షాపా తం 13.2 మిల్లీ మీటర్ల చొప్పున నమోదైంది.
పైర్లకు ప్రాణం పోసిన వానలు
ఖరీఫ్‌ సీజన్‌ పంటల సాగు ఆగస్టు మొదటి వారంలోనే పూర్తయ్యాయి. ఆగస్టు చివరి నాటికి వరి పైర్లు కలుపుతీత సమయానికి వచ్చాయి. ఈ సమయంలో నీటి వినియోగం బాగా పెరిగింది. దీంతో కాల్వలకు నీటిని విడుదల చేయడం, వ్యవసాయ మోటర్లు ఎక్కువ సమయం నడవడంతో చెర్వులు, బోర్లు, బావుల నీటి మట్టం తగ్గింది. ఎండల తీవ్రత కూడా పెరిగింది. వర్షాభావ పరిస్థితులేర్పడడంతో పైర్లకు నీటి ఎద్దడి సమస్య తలెత్తింది. పత్తిపైర్లు నీటి ఎద్దడి వల్ల పూత రాలిపోయింది. పిందలు ఒట్టిపోయి రాలిపోయాయి. కంది, పెసర, ఉల్లి, మొక్కజొన్న, జొన్న వంటి ఇతర పంటలకు కూడా నీటి సమస్య తలెత్తింది. మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో వరి పైర్లు కూడా కలుపుతీత, ఎరువులు వాడకంతోపైర్తు ఏపుగా పెరిగాయి. పైర్లు పెరిగే దశలో నీటి సమస్య వచ్చింది. వర్షాధారంగా నాట్లు వేసిన పొలాల్లో నీళ్లులేక వరి పైర్లు వాడుపట్టే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో వర్షం కోసం ఎదురు చూస్తున్న వేళ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. నాలుగు రోజుల పాటు భారీగా వర్షాలు కురియడంతో పైర్లకు ప్రాణం పోసినట్లైంది. పత్తి, చెరకు, కంది, మొక్కజొన్న, వరి పైర్లతో పాటు జామ, సపోట, ఆలు, ఉల్లిగడ్డ వంటి పంటలకు వర్షాలు ఉపయోగపడ్డాయి.
సస్య రక్షణ చర్యలు: నర్సింహ్మరావు,
జిల్లా వ్యవసాయ అధికారి
ఇటీవల కురుస్తున్న వర్షాలు పైర్లకు ఉపయోగపడ్డాయి. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో ఆరుతడి పంటలకు నీటి ఎద్దడి ఏర్పడింది. వర్షాలు పడినందున నీటి ఎద్దడి సమస్య తీరింది. అధిక వర్షాలకు తెగుళ్లు సోకే అవకాశముంది. లోతట్టు ప్రాంతాల్లో మునిగిన పైర్లు కూడా దెబ్బతింటాయి. రైతులు పైర్లకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. వ్యవసాయ అధికారుల సూచనల మేరకు సస్యరక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా పైర్లను కాపాడుకోవాలి.